News November 19, 2025

జగిత్యాల: 28, 29 తేదీల్లో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

image

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురాతన ఉన్నత పాఠశాలలో నవంబర్ 28, 29 తేదీల్లో జిల్లాస్థాయి ప్రేరణ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రాము తెలిపారు. వికసిత్, ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో అన్ని పాఠశాలల నుంచి 6-10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొనాలన్నారు. వివరాలకు జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్‌ను 94402 12333లో సంప్రదించాలన్నారు.

Similar News

News January 15, 2026

కంచికచర్ల ముంగిట Way2News ముచ్చట!

image

కంచికచర్లలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మహిళలు రంగవల్లులతో గ్రామాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా Way2News లోగోను సైతం రంగవల్లుల రూపంలో అద్దడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామానికి చెందిన అపర్ణ అనే మహిళ నిరంతరం వార్తలు ప్రజలకు చేరవేస్తూ, తన సేవలతో ప్రజల ఆదరాభిమానాలు సంపాదించుకున్నారని ఆమె కొనియాడారు.

News January 15, 2026

పక్షిలా ఎగరాలి అంటే.. భీమవరం రండి..!

image

కాళ్ల మండలం పెదమీరంలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ‘స్కైరైడ్ అడ్వెంచర్’ను బుధవారం డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. కలెక్టర్ స్వయంగా రైడ్ చేసి, గగన విహారం అద్భుతమైన అనుభవమని కొనియాడారు. ఈ నెల 14 నుంచి 16 వరకు ప్రజలకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ సాహస క్రీడను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

News January 15, 2026

నేడు మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి వరపూజ

image

ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి వరపూజ మహోత్సవం గురువారం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మహేష్ తెలిపారు. స్వామి వారికి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు వరపూజ కత్రువు సంక్రాంతి రోజు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. మేలో జరిగే నరసింహస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నేడు వరపూజ, నిశ్చయ తాంబూల స్వీకరణ ఉంటుందన్నారు. కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరు కానున్నారు.