News August 13, 2025

జగిత్యాల: 35.96 కిలోల గంజాయి దహనం

image

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన 36 కేసుల్లో నిందితుల వద్ద నుంచి సీజ్ చేసిన 35.96 కిలోల గంజాయిని మంగళవారం దహనం చేశారు. NDPS చట్ట ప్రకారం జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ, ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. సుమారు రూ. 9 లక్షలు విలువైన గంజాయిని పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ దహనం చేసినట్టు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.

Similar News

News March 6, 2026

తెనాలిలో ఉగాది పురస్కారాల సంబరాలు..!

image

పరాభవనామ తెలుగు సంవత్సరo ఉగాది పురస్కారాల సంబరాలను మా-ఎపి భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న వారిని ఎంపిక చేసి అవార్డులను ప్రధానోత్సవం చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఆహ్వానించబోతున్నట్లు వివరించారు. తేదీ,వేదిక త్వరలో ప్రకటిస్తామన్నారు.

News March 6, 2026

సూర్యాపేట: కేవైసీ ఉంటేనే ఉపాధి పనులు

image

వచ్చే నెల నుంచి ఉపాధి హామీ పథకంలో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా కూలీల హాజరు నమోదు చేయనున్నారు. ఈ-కేవైసీ పూర్తి చేసిన కూలీలకే పనులు కల్పించనున్నారు. ఎన్ఎంఎంఎస్ యాప్‌లో ప్రతి కూలీ ఫొటోను ఉదయం, మధ్యాహ్నం నమోదు చేసినప్పుడే వేతనాలు చెల్లించనున్నారు. జిల్లాలో 3,21,449మంది కూలీలు ఉండగా, అందులో 2,94,126 మంది (91.55%) ఈ-కేవైసీ పూర్తి చేశారు. హాజరు అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

News March 6, 2026

‘ప్రగతి పాలన’కు యాక్షన్ ప్లాన్ సిద్ధం: కలెక్టర్ ప్రావీణ్య

image

సంగారెడ్డి జిల్లాలో 99 రోజుల ‘ప్రగతి పాలన’ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించామని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మెదక్‌లో మంత్రి వివేక్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఆమె పాల్గొన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ఏర్పాట్లు చేశామన్నారు. ముఖ్యంగా ఆరోగ్యం, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ వెల్లడించారు.