News December 1, 2025
జగిత్యాల: 3,536 పోలింగ్ స్టేషన్లకు 110 మైక్రో అబ్జర్వర్లు

జగిత్యాల జిల్లా కార్యాలయంలో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వారి పాత్ర కీలకమని, చెక్‌లిస్ట్ ఆధారంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు పరిశీలించాలని సూచించారు. జిల్లాలో 3,536 స్టేషన్లకు 110 మంది మైక్రో అబ్జర్వర్లు నియమించినట్టు తెలిపారు. సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.
Similar News
News February 16, 2026
విత్తనాలు కొనేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి

విత్తనాలను లైసెన్స్ కలిగిన అధీకృత డీలర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. సీల్ తీసి ఉన్న విత్తన సంచులు, పగిలిన విత్తన ప్యాకెట్లు, మూతలు తీసిన డబ్బాల్లోని విత్తనాన్ని కొనుగోలు చేయకూడదు. హైబ్రిడ్ విత్తనం( మొక్కజొన్న, మిరప పంటలకు) కొనుగోలు చేసేముందు విత్తనం రకం, భౌతిక, జన్యు స్వచ్ఛతలు, మొలకెత్తే స్వభావం అన్నీ లేబుల్ మీద సరిగా ఉన్నాయా, లేదా అని ఒకటికి రెండుసార్లు గమనించి కొనుగోలు చేయాలి.
News February 16, 2026
ఇంట్లో కర్పూరం వెలిగిస్తే…

కర్పూరానికి ఇంట్లోని వాస్తు దోషాలను తొలగించే శక్తి ఉంటుందని పండితులు అంటున్నారు. రోజూ సాయంత్రం కర్పూరం వెలిగిస్తే ప్రతికూల శక్తి నశించి, సానుకూలత పెరుగుతుందని చెబుతున్నారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కర్పూరం చంద్ర, శుక్ర గ్రహాలకు ప్రతీక. దీన్ని వెలిగిస్తే పితృదోషాలు తొలగి, ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. కర్పూర సువాసన గాలిలోని బ్యాక్టీరియాను హరించి ఆరోగ్యకర వాతావరణాన్ని, మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
News February 16, 2026
బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి పొనుగుపాటి

అంబేడ్కర్ కోనసీమ జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా పొనుగుపాటి శ్రీనివాస్ వరుసగా రెండోసారి నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ తనను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారని శ్రీనివాస్ తెలిపారు. తనపై నమ్మకం ఉంచి రెండోసారి తనకు అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు.


