News September 11, 2025
జగిత్యాల: ‘CPRపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి’

SKNR ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ డిగ్రీ కళాశాలలో NCC, NSS విద్యార్థులకు CPRపై IMA జగిత్యాల వారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైద్యులు మాట్లాడుతూ.. విద్యార్థులు అవగాహన పెంచుకుని గ్రామాల్లో ప్రజలకు వివరించి ప్రాణాపాయం నుంచి కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో IMA అధ్యక్షుడు డా.హేమంత్, ప్రధాన కార్యదర్శి డా.శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ ఏ.అశోక్ పాల్గొన్నారు.
Similar News
News December 13, 2025
బాపట్ల జిల్లాలో అధికంగా ఎవరు మరణించారంటే..!

రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్న వారిలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులేనని బాపట్ల SP ఉమామహేశ్వర్ తెలిపారు. ప్రధాన కారణం హెల్మెట్ ధరించకపోవడమేనన్నారు. ఇటీవల చెరుకుపల్లిలో జరిగిన ప్రమాదంలో హెల్మెట్ లేకపోవడం వల్ల తలకు బలమైన గాయాలవడం వల్ల ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. అనేక మంది బైక్ నడిపేవారే మృత్యువాత పడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు.
News December 13, 2025
TRENDING: అబిడ్స్ సండే ‘మార్కెట్’

ఆన్‌లైన్ పుస్తకాల హడావిడిలోనూ హైదరాబాద్ యువత ‘పాత పుస్తకాల’పైనే మోజు పెంచుకుంటోంది. డిజిటల్ విప్లవాన్ని ధిక్కరిస్తూ, ప్రతి ఆదివారం అబిడ్స్ ఫుట్‌పాత్‌లపై అరుదైన పుస్తకాలను వేటాడుతున్నారు. 60 ఏళ్ల నాటి క్లాసిక్‌లు, వింటేజ్ మ్యాగజైన్‌లు, సాహిత్యం కోసం వీరు ఇక్కడికి పోటెత్తుతున్నారు. కమ్యూనిటీతో కనెక్ట్ అయ్యే ఈ అద్భుతమైన సంప్రదాయం నేటి యువతలో ట్రెండింగ్‌గా మారుతోంది. ఇక్కడ ధరలు కూడా తక్కువే.