News November 17, 2025

జగిత్యాల: EVMల గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

image

ధరూర్ క్యాంప్‌లో ఉన్న ఈవీఎంల గోదామును జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి.సత్యప్రసాద్ సోమవారం తనిఖీ చేశారు. యంత్రాల భద్రత, సీసీ కెమెరాల పనితీరు, సాంకేతిక వ్యవస్థలను ఈ సందర్భంగా ఆయన సమగ్రంగా పరిశీలించారు. గోదాములో ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, నిత్యం పర్యవేక్షణ కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, ఆర్డీవో మధుసూదన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Similar News

News January 22, 2026

శ్రీకాళహస్తిలో VIPలకు టైంస్లాట్ దర్శనం

image

మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనార్థం వచ్చే వీఐపీలకు టైం స్లాట్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రకటించారు. ప్రోటోకాల్‌కు అనుగుణంగా తిరుమల తరహాలోనే శ్రీకాళహస్తిలో నిర్దేశిత సమయాన్ని వీఐపీల దర్శనానికి కేటాయిస్తామని చెప్పారు. వీఐపీలు తమకు కేటాయించిన సమయంలోనే దర్శించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News January 22, 2026

భారత్‌లో T20 WC ఆడేదే లేదు: బంగ్లాదేశ్

image

ICC T20WC మ్యాచ్‌లు భారత్‌లో ఆడేదే లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. వెన్యూ మార్చితే తమ నిర్ణయంలో మార్పు ఉంటుందని పేర్కొంది. తమకు WC ఆడాలని ఉందని, అయితే ఇండియాలో కాదని తెలిపింది. భద్రత దృష్ట్యా తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని కోరగా ఐసీసీ ఒప్పుకోని విషయం తెలిసిందే. భారత్‌లో ఆడాల్సిందేనని ICC తేల్చిచెప్పింది. దీంతో ఇవాళ BCB తమ తుది నిర్ణయాన్ని వెల్లడించింది.

News January 22, 2026

నవజాత గొర్రె పిల్లల మరణాలకు కారణం ఏమిటి?

image

నవజాత గొర్రె పిల్లల మరణాలు పెంపకందారులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. పుట్టిననాటి నుంచి 28 రోజుల వయసు కలిగిన గొర్రె పిల్లలను నవజాత పిల్లలుగా పరిగణిస్తారు. నవజాత పిల్లల మరణాల్లో దాదాపు 35 శాతం అవి పుట్టినరోజే సంభవిస్తాయని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. గొర్రెల పెంపకందారుల నిర్లక్ష్యం, వ్యాధికారక క్రిములు, సూక్ష్మజీవులు, పరాన్న జీవులు సోకడమే ఈ మరణాలకు కారణమని వెటర్నరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.