News November 7, 2025
జగిత్యాల: ITI అభ్యర్థులకు జాతీయ అప్రెంటిషిప్ అవకాశాలు

జగిత్యాల పరిసర ప్రాంతాల ITI పాసైన అభ్యర్థుల కోసం PM National Apprenticeship Mela ఈనెల 10న ప్రభుత్వ ITI ధరూర్ క్యాంప్‌లో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. L&T,వరుణ్ మోటార్స్,స్కెండర్ ఎలక్ట్రికల్స్,టాటా మోటార్స్,MRF Hyderabad ప్రతినిధులు హాజరు కానున్నారని ప్రిన్సిపల్ గంట్యాల రవీందర్ తెలిపారు.అభ్యర్థులు Apprenticeship రిజిస్ట్రేషన్, SSC, ITI సర్టిఫికేట్, TC, ఆధార్ జిరాక్స్‌తో హాజరు కావాలన్నారు.
Similar News
News January 21, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

రోడ్లు లేని గ్రామాలు ఉండవు: అచ్చెన్న
రథసప్తమి ఏర్పాట్లు పరిశీలనలో ఎమ్మెల్యే గొండు శంకర్
చేనేత కార్మికుల వృద్ధికి కృషిచేస్తాం: ఎమ్మెల్యే గోవిందరావు
శ్రీకాకుళం: ఆలయాల భద్రత పై ప్రత్యేక దృష్టి
సామాన్య భక్తులకు ప్రాధాన్యత: అరసవల్లి ఈఓ
భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి: హోంమంత్రి అనిత
కేంద్ర రక్షణ మంత్రిని కలిసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు
News January 21, 2026
డిండి: విద్యార్థులను పరామర్శించిన డీఈవో

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న డిండి మోడల్ స్కూల్ విద్యార్థులను జిల్లా విద్యాశాఖాధికారి భిక్షపతి, యూటీఎఫ్ నాయకులు బుధవారం పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులతో నేరుగా మాట్లాడి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులను కోరారు. విద్యార్థులు కోలుకునే వరకు అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడవద్దని డీఈవో భరోసా ఇచ్చారు.
News January 21, 2026
25న రథ సప్తమి.. ఆ దర్శనాలన్నీ రద్దు!

AP: తిరుమలలో ఈ నెల 25న రథ సప్తమిని వైభవంగా నిర్వహించనున్నట్లు TTD తెలిపింది. ఈ నేపథ్యంలో ఆరోజు ఆర్జిత సేవలు, NRI, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే తిరుపతిలో 24 నుంచి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపేసినట్లు పేర్కొంది. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు వివరించింది.


