News February 4, 2025
జగిత్యాల: SI శ్వేత మృతి బాధాకరం: ఎస్‌పీ

JGTL గొల్లపల్లి చిల్వకోడూరు వద్ద కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో జగిత్యాల జిల్లా పోలీస్ DCRBలో పనిచేస్తున్న ఎస్ఐ కొక్కుల శ్వేత మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎస్ఐ శ్వేత మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా ఆమె కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్ఐ శ్వేత మృతి చాలా బాధాకరమని తెలిపారు. శ్వేత మృతి పట్ల పోలీస్ అధికారులు సంతాపం తెలియజేశారు.
Similar News
News February 19, 2025
RTCలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇన్సూరెన్స్

APSRTCలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ.10లక్షల ప్రమాద బీమా వర్తించనుంది. అద్దె బస్సులు, ఔట్ సోర్సింగ్ డ్రైవర్లు, బస్సుల్లో అటెండర్లు, బస్టాండ్లు, గ్యారేజీలు, స్వీపర్లు, గైడ్లు, కౌంటర్లలో బస్ టికెట్లు జారీ చేసే సిబ్బందికి ఇది వర్తించనుంది. దీనికి వారిని నియమించుకున్న కాంట్రాక్టర్ ఒక్కొక్కరికి రూ.499 చొప్పున పోస్టల్ శాఖ అంత్యోదయ శ్రామిక్ సురక్ష యోజన బీమాకు ప్రీమియం చెల్లించాలి.
News February 19, 2025
తిరుపతి: న్యాయ సేవ సహాయకుల పోస్టులకు నోటిఫికేషన్

తిరుపతి జిల్లాలోని గూడూరు, కోట, వెంకటగిరి, S.పేట, N.పేటల్లో న్యాయ సేవ అధికార కమిటీల పారా లీగల్ సహాయకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గీత తెలిపారు. 25 లోగా దరఖాస్తులను రిజిస్టర్ పోస్టు ద్వారా జిల్లా కోర్టుకు అందించాలన్నారు. ఇంటర్, ఆపైన చదివిన పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్‌వాడీ సేవకులు, లా విద్యార్థులు దరఖస్తు చేసుకోవచ్చన్నారు.
News February 19, 2025
27న కోనసీమ జిల్లాలో సెలవు

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27న జరగనుంది. పలువురు అధికారులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం ఓటింగ్‌లో పాల్గొననున్నారు. ఈక్రమంలో 27వ తేదీన స్పెషల్ లీవ్ మంజూరైందని ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా సెలవును అడ్జస్ట్ చేసుకోవాలని ఆమె సూచించారు.