News February 27, 2025
జగిత్యాల:10AM వరకు పోలింగ్ శాతం నమోదు వివరాలు

జగిత్యాల జిల్లాలో పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ శాతం గురువారం ఉదయం 10 గంటల వరకు నమోదైన వివరాలు ఇలా ఉన్నాయి. టీచర్ ఎమ్మెల్సీకి 9.67 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోగా.. పట్టబద్రుల ఎమ్మెల్సీ ఓటింగ్ శాతం 6.43% నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తంగా రెండు కలిపి 6.58% పోలింగ్ నమోదు అయినట్లు పేర్కొన్నారు.
Similar News
News February 27, 2025
ఆస్తమా ఉంది.. సెల్‌లో మరొకరిని ఉంచండి: వంశీ

AP: విజయవాడ కోర్టులో మేజిస్ట్రేట్ వద్ద వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఆస్తమా ఉందని, తనతో పాటు సెల్‌లో మరొకరిని ఉంచాలని కోరారు. భద్రతాపరంగా తనకు ఇబ్బంది లేదని వివరించారు. సెల్‌లో మరొకరిని ఉంచేందుకు ఇన్‌ఛార్జ్ జడ్జిగా తాను ఆదేశించలేనన్న న్యాయమూర్తి, సెల్ మార్పు కోసం రెగ్యులర్ కోర్టులో మెమో దాఖలు చేయాలని ఆదేశించారు. వంశీ సెల్ వద్ద వార్డెన్‌ను ఉంచాలని జైలు అధికారులకు జడ్జి స్పష్టం చేశారు.
News February 27, 2025
పాకిస్థాన్ చెత్త రికార్డు

ఛాంపియన్స్ ట్రోఫీలో PAK చెత్త రికార్డు నమోదు చేసింది. గత 23 ఏళ్లలో ఒక ICC టోర్నీకి ఆతిథ్యమిస్తూ ఒక్క మ్యాచ్‌లోనూ గెలవని జట్టుగా నిలిచింది. చివరిసారిగా 2000లో కెన్యా ఈ అపఖ్యాతిని మూటగట్టుకుంది. 1996 తర్వాత పాక్‌కు ICC టోర్నమెంట్ నిర్వహించే అవకాశం వచ్చింది. దీంతో తమ జట్టు ప్రదర్శనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. PAK టీమ్ పరిస్థితి దిగజారిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News February 27, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

☞ ఆత్మకూరు రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
☞ టీడీపీతోనే ముస్లింలకు పెద్దపీట: మంత్రి బీసీ
☞ మంత్రి ఫరూక్‌ను కలిసిన రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్
☞ శ్రీశైలంలో చిరుత కళేబారానికి పోస్టుమార్టం పూర్తి
☞ జమ్మలమడుగులో కాకరవాడ వ్యక్తి సూసైడ్
☞ కోడుమూరులో కారు దగ్ధం☞ ఎమ్మిగనూరులో చోరీ
☞ భక్తులతో కిక్కిరిసిన మహానంది క్షేత్రం
☞ పెట్నికోట క్రీడలలో రాష్ట్రస్థాయి విజేతలుగా ప్యాపిలి, గుంటూరు