News August 13, 2025

జగ్గంపేట ఎమ్మెల్యే PAనంటూ మోసాలు.. వ్యక్తి అరెస్ట్

image

జగ్గంపేట MLA జ్యోతుల నెహ్రూ PAగా చెప్పుకుంటూ VIP దర్శనం టికెట్లు ఇప్పిస్తానని చెప్పి రూ.50వేలు డిమాండ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గుడిమూలం గ్రామానికి చెందిన జి.రాజకుమార్‌ 2020-24లో పలు చీటింగ్ కేసుల్లో నిందితుడు. గూగుల్, సోషల్ మీడియా ద్వారా బాధితుల వివరాలు సేకరించి మోసాలు చేసేవాడు. కాకినాడ SP బిందుమాధవ్ ఆదేశాలతో ప్రత్యేక బృందం అతనిని పట్టుకుని అరెస్టు చేసింది.

Similar News

News March 17, 2026

అనకాపల్లి: ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 217 గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 217 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 9,552 మంది హాజరు కావలసి ఉండగా 9,335 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పగడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు.

News March 17, 2026

జగిత్యాల: కుక్క కాటు.. ప్రాణం తీసింది..!

image

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మణితేజ(7) కుక్కకాటుకు గురై, 15 నెలలపాటు మృత్యువుతో పోరాడి చనిపోయాడు. 2024 డిసెంబర్ 26న మెడ భాగంలో కుక్క కరవడంతో వెంటనే HYDలో చికిత్స అందించారు. అనంతరం ఇంట్లోనే ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి వైద్యం కొనసాగించారు. సుమారు రూ.65 లక్షలు ఖర్చు చేసినప్పటికీ బాలుడిని కాపాడలేకపోయారు.

News March 17, 2026

జగిత్యాల: జీవన్ రెడ్డి అసంతృప్తి వెనుక బలమైన కారణాలు ఇవే!

image

నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉన్న జీవన్ రెడ్డి 11 సార్లు పోటీ చేసి ఆరు సార్లు గెలిచారు. మూడు సార్లు మంత్రి, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. కానీ 2023 తర్వాత మంత్రి పదవి దక్కకపోవడం, MLC రెన్యూవల్ లేకపోవడం అసంతృప్తికి కారణమైంది. డా.సంజయ్‌తో కలిసి పని చేయాల్సి రావడం, మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి ప్రాధాన్యం లేకపోవడంతో ఇండిపెండెంట్లను గెలిపించారు. ప్రస్తుతం ఆయన తదుపరి అడుగు ఆసక్తిగా మారింది.