News October 6, 2025

జడ్చర్ల: ఆర్‌ఎంపీ నిర్లక్ష్యం.. బాలుడి మృతి

image

జడ్చర్ల మండలం లింగంపేటలో ఓ ఆర్‌ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఓ బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కురవపల్లి గ్రామానికి చెందిన వరుణ్ తేజ్‌(11)కు అనారోగ్యం కారణంగా లింగంపేటలోని ఆర్‌ఎంపీ వైద్యుడు ఇంజక్షన్ ఇచ్చాడు. ఇంటికి వెళ్లాక బాలుడి పరిస్థితి విషమించడంతో, హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు.

Similar News

News January 14, 2026

మెట్రో మార్కు చిత్రకళ.. ‘పరిచయ్’ అదిరింది బాసూ!

image

మెట్రో రైలును పట్టాలెక్కించినట్టే చిత్రకారుల ప్రతిభను ప్రపంచానికి చాటాలంటున్నారు NVS రెడ్డి. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘పరిచయ్ ఆర్ట్ ఫౌండేషన్’ నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్, క్యాంప్ కళాభిమానులను ఫిదా చేస్తోంది. ఒకేచోట ప్రదర్శన, ప్రత్యక్ష చిత్రలేఖనం చూడటం అరుదైన అవకాశమని చెప్పుకొచ్చారు. జయవంత్ నాయుడు ఆధ్వర్యంలో 12 మంది దిగ్గజ చిత్రకారుల కుంచె నుంచి జాలువారిన అద్భుతాలు ఇక్కడ కొలువుదీరాయి.

News January 14, 2026

ఊల వేసిన మడిలో నీరుంటుందా?

image

పూర్తిగా పొడిబారిన లేదా ఇసుకతో కూడిన భూమి నీరు త్వరగా ఇంకిపోయే గుణం కలిగి ఉంటుంది. ఆ నేలలో లేదా మడిలో నీరు పోసిన వెంటనే ఇంకిపోతుంది తప్ప, నిలబడి ఉండదు. అలాగే ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎంత జ్ఞానం బోధించినా, గ్రహించే బుద్ధిలేని వ్యక్తికి అవి ఏమాత్రం ఉపయోగపడవు. ఊల మడిలో వేసిన నీరులాగే ఇంకిపోతాయి. మంచి సలహా ఇచ్చినా దాన్ని స్వీకరించే మనస్తత్వం లేని వారి గురించి చెప్పేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.

News January 14, 2026

‘సంక్రాంతి’ అంటే ఏంటో మీకు తెలుసా?

image

సంక్రాంతి అంటే సూర్యుడు ఓ రాశి నుంచి మరొక రాశిలోకి మారడం. ఇది ‘శంకర’ అనే పదం నుంచి వచ్చిందని అంటారు. శంకర అంటే కదలిక. ప్రాణం ఉంటేనే కదలిక ఉంటుందని, గ్రహాల గమనం వల్లే సృష్టి నడుస్తుందని దీనర్థం. సంస్కృతంలో ‘సం’ అంటే మంచి, ‘క్రాంతి’ అంటే మార్పు. సూర్యుడు ప్రతి నెలా రాశి మారుతున్నా, ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ‘మకర సంక్రాంతి’ని మనం పెద్ద పండుగగా జరుపుకుంటాం. ఈ మార్పు అభ్యుదయానికి సంకేతం.