News May 7, 2025
జడ్చర్ల: మళ్లీ KCR పాలన రావాలి: మాజీ మంత్రి

జడ్చర్ల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడారు. సంక్షేమ పాలన రావాలంటే ప్రజలు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని అంటున్నారని తెలిపారు. పదేళ్ల కాలంలో కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ దోరేపల్లి లక్ష్మీ, వార్డు అధ్యక్షుడు అల్మాస్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News February 19, 2026
తగ్గిన చింతపండు ధరలు

రాయదుర్గం మార్కెట్ యార్డుకు బుధవారం 232.5 క్వింటాళ్ల చింతపండు వచ్చినట్లు కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. వివిధ గ్రామాల నుంచి రైతులు తెచ్చిన చింతపండులో క్వింటా ఫ్లవర్ రకం గరిష్ఠంగా రూ.10,200, కనిష్ఠంగా రూ.5,500 పలికింది. కరిపులి రకం గరిష్ఠంగా రూ.16,300, కనిష్ఠంగా రూ.13,000 ధర పలికినట్లు వెల్లడించారు. ప్రతి బుధవారం మార్కెట్‌లో చింతపండు విక్రయాలు జరుగుతాయని ఆయన వివరించారు.
News February 19, 2026
వాళ్లు ఇండియాను ఓడించలేదు: పాక్ క్రికెటర్

ఇండియాతో మ్యాచ్‌లో పాక్ <<19153355>>ఘోరంగా<<>> ఓడిపోవడం తెలిసిందే. ఈ క్రమంలో తమపై <<19155191>>తీవ్ర విమర్శలు<<>> చేస్తున్న మాజీలకు పాక్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ కౌంటర్ ఇచ్చారు. ‘మాజీ క్రికెటర్లకు వాళ్ల సొంత అభిప్రాయాలు ఉంటాయి. వారు దిగ్గజాలు. కానీ మేం చేసినట్లు వాళ్లు చేయలేదు. మేం ప్రపంచకప్‌లో ఇండియాను ఓడించాం. అయినా విమర్శలనేవి క్రికెట్ చరిత్రలో భాగం’ అని అన్నారు. 2021 T20 WCలో ఇండియాపై పాక్ గెలిచింది.
News February 19, 2026
ఫిబ్రవరి 19: చరిత్రలో ఈరోజు

1473: ఖగోళ శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్ జననం
1630: మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ జననం
1915: స్వాతంత్య్ర సమర యోధుడు గోపాలకృష్ణ గోఖలే మరణం
1930: సినీ దర్శకుడు, నటుడు కె.విశ్వనాథ్ జననం
2009: తెలుగు నటి నిర్మలమ్మ మరణం
2018: హాస్యనటుడు గుండు హనుమంతరావు మరణం


