News May 7, 2025
జడ్చర్ల: వక్ఫ్ సవరణ చట్టం అవగాహన సదస్సులో డీకే అరుణ

జడ్చర్లలోని ప్రేమ్ రంగా గార్డెన్‌లో వన్ నేషన్-వన్ ఎలక్షన్, వక్ఫ్ సవరణ చట్టం అవగాహన సదస్సులో మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ముస్లిం పేదలకు న్యాయం చేసేందుకు ఏర్పడిన ధార్మిక సంస్థనే వక్ఫ్ చట్టం అని అన్నారు. 2018 రిపోర్ట్ ప్రకారం ఈ దేశంలో 80 లక్షల ఎకరాలు భూములు వక్ఫ్ ఆస్తులున్నట్లు తేలిందన్నారు. కానీ ఈ ఆస్తుల వల్ల ఏ ఒక్క పేద ముస్లింకు న్యాయం జరగలేదన్నారు.
Similar News
News February 16, 2026
‘సంజీవని’ ప్రాజెక్టు గురించి తెలుసా?

AP: సీఎం చంద్రబాబు, బిల్ గేట్స్ ప్రారంభించే ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ హెల్త్ కార్డులు, ఉచిత వైద్య పరీక్షలు, మాతా శిశు సంరక్షణ సహా ఇతర సేవలు అందనున్నాయి. హెల్త్ రికార్డులు డిజిటల్ చేయడంతో పాటు రూ.2.5 లక్షల ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించనున్నారు. ఇప్పటికే కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా కొనసాగిస్తుండగా రాష్ట్రమంతటా విస్తరించనున్నారు. ఇందులో గేట్స్ ఫాండేషన్‌తో TCS భాగస్వాములు.
News February 16, 2026
రసవత్తరంగా కరీంనగర్, NZB మేయర్ ఎన్నిక!

TG: కాసేపట్లో మేయర్ ఎన్నిక నేపథ్యంలో కరీంనగర్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ ఎక్స్‌అఫీషియోతో కలిపి 69(66+3) ఓట్లున్నాయి. ఓటింగ్‌కు దూరంగా ఉండాలని BRS నిర్ణయించడంతో ఓట్ల సంఖ్య 60కి, మ్యాజిక్ ఫిగర్ 31కి మారింది. MP బండి సంజయ్‌తో కలిపి 34 ఓట్లున్న BJPకే మేయర్ పీఠం దక్కే అవకాశం పుష్కలంగా ఉంది. అటు NZBలో BJP 28, CONG 17, MIM 14, BRS 1 సీట్లున్నాయి. CONG-MIM కలిసి మేయర్ పీఠం దక్కించుకోవచ్చు.
News February 16, 2026
పుర ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ

జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పరోక్ష ఎన్నికల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు మూడు మున్సిపాలిటీల పరిధిలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి అలజడి సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ర్యాలీలు, ఊరేగింపులు నిషేధమన్నారు.


