News May 7, 2025
జడ్చర్ల GOVT కాలేజీలో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

జడ్చర్ల మండలం మాచారం గ్రామంలోని (నాగర్‌కర్నూల్ సెంటర్) తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భవాని ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. కళాశాలలో బీజెడ్సీ, ఎంజెడ్సీ, ఎంపీసీఎస్, ఎంపీసీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు కళాశాలలో సంప్రదించాలని కోరారు. SHARE IT
Similar News
News February 7, 2026
ఇస్లామాబాద్‌లో దాడి చేసింది మేమే: ఐసిస్

పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరిగిన <<19072203>>ఆత్మాహుతి దాడి <<>>తమ పనేనని ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ప్రకటించింది. ‘మసీదులోకి వెళ్లేందుకు యత్నించిన మా ఫైటర్‌ను గార్డులు అడ్డుకున్నారు. దీంతో ప్రజలు గుమిగూడిన చోట అతడు తనను తాను పేల్చేసుకున్నాడు’ అని ఓ ప్రకటనలో తెలిపింది. అటాక్ చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని పాక్ PM షరీఫ్ ట్వీట్ చేశారు. ఉగ్రవాదాన్ని ఓడించాలనే తమ సంకల్పానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
News February 7, 2026
జనగామను వీడిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ఎంటర్

మూడు రోజులుగా జనగామ జిల్లా ప్రజలను భయాందోళనకు గురి చేసిన పెద్ద పులి సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించిందని డీఎఫ్ఓ లావణ్య వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి రఘునాథపల్లి మండలంలో సంచరించిన పులి శుక్రవారం అర్ధరాత్రి నర్మెట్ట మండలం మీదుగా సిద్దిపేట జిల్లాలోకి వెళ్లిందని తెలిపారు. ఏదేమైనా పులి చిక్కేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News February 7, 2026
MBNR: పుర పోరు.. నేతల్లో వణుకు !

ఉమ్మడి జిల్లాలోని ఒక కార్పొరేషన్,18 మున్సిపాలిటీల పీఠాలను దక్కించుకోవడం ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఎన్నికలలో వచ్చే ఫలితాలే తమ పొలిటికల్ కెరీర్‌కు లైఫ్ సర్టిఫికెట్ అని మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీలు భావిస్తున్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ విందులు, వినోదాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కాంగ్రెస్, BRS, BJP మధ్య త్రిముఖపోటీ నేపథ్యంలో ఆయా పార్టీల నేతల్లో ముందస్తు వణుకు మొదలైంది.


