News September 10, 2025
జనగామలో ఘనంగా గురుపూజోత్సవం

జనగాం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు గురుపూజోత్సవం-2025 ఘనంగా జరగనుంది. తెలంగాణ పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలో కలెక్టర్ పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు సన్మానం చేస్తారు. అందరూ హాజరై విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులు కోరారు.
Similar News
News December 17, 2025
కరీంనగర్: తుది దశకు పల్లె పోరు.. బరిలో 1580 మంది

పల్లె సమరం తుది దశకు చేరుకుంది. 1580 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కరీంనగర్ జిల్లాలో 111 GPలకు 3 ఏకగ్రీవం కాగా 108 స్థానాలకు 451 మంది పోటీ పడుతున్నారు. SRCL జిల్లాలో 87 GPలకు 7 ఏకగ్రీవం కాగా 80 స్థానాలకు 379 మంది, జగిత్యాల జిల్లాలో 119 GPలలో 6 ఏకగ్రీవం కాగా 113 స్థానాలకు 456 మంది బరిలో నిలిచారు. PDPL జిల్లాలో 91 GPలలో 6 ఏకగ్రీవం కాగా 85 స్థానాలకు 294 మంది రేసులో ఉన్నారు.
News December 17, 2025
ఖమ్మం జిల్లా మహిళా ప్రాంగణంలో శిక్షణ

ఖమ్మం జిల్లా మహిళా ప్రాంగణంలో కమ్యూనిటీ హెల్త్‌వర్కర్, కంప్యూటర్, టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామని ప్రాంగణ అధికారి వేల్పుల విజేత తెలిపారు. 18 నుంచి 35 ఏళ్లలోపు, అర్హత కలిగిన ఆసక్తిగల మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు కోర్సును బట్టి 8వ తరగతి లేదా 10వ తరగతి ఉత్తీర్ణతగా నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీ లోపు ప్రాంగణంలో దరఖాస్తులు సమర్పించాలని ఆమె కోరారు.
News December 17, 2025
ఆసిఫాబాద్‌లో విభిన్న దృశ్యాలు.. ఓడినా హామీ నిలబెట్టిన

ఆసిఫాబాద్ జిల్లాలో రెండు విభిన్న ఎన్నికల ఘటనలు చర్చనీయాంశం అయ్యాయి. కౌటాల మండలం కనికిలో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి విజయలక్ష్మి, ఇచ్చిన హామీ మేరకు ఆలయం వద్ద బోరు వేయించి నైతికతను చాటుకున్నారు. అయితే, చింతలమానేపల్లి మండలం బాలాజీ అనుకోడలో ఓడిన అభ్యర్థి, ఓటు వేయలేదంటూ ఇంటింటికీ తిరిగి ఖర్చు చేసిన డబ్బులు అడగడం విమర్శలకు దారి తీసింది.


