News December 2, 2025

జనగామలో సర్పంచ్ స్థానాలకు 242 నామినేషన్లు

image

జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు ఊపందుకుంది. నాలుగు మండలాల్లోని 72 సర్పంచ్ స్థానాలకు మొత్తం 242 నామినేషన్లు దాఖలయ్యాయి. బచ్చన్నపేట మండలంలో 90, నర్మెటలో 54, జనగామలో 58, తరిగొప్పులలో 40 నామినేషన్లు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ పకడ్బందీగా జరుగుతోంది.

Similar News

News February 13, 2026

మెట్‌పల్లి మున్సిపాలిటీలో బీజేపీ హవా

image

మెట్‌పల్లి మున్సిపాలిటీలో బీజేపీ సత్తా చాటింది. మెట్‌పల్లి మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులు ఉండగా.. అందులో బీజేపీ 10 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 6 స్థానాలను, బీఆర్ఎస్ పార్టీ 6 స్థానాలను గెలుచుకోగా స్వతంత్రులు 4 స్థానాలలో గెలుపొందారు. కాగా, ఛైర్‌పర్సన్ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లభించలేదు. ఛైర్‌పర్సన్ ఎన్నికలో స్వతంత్రులు కీలకం కానున్నారు.

News February 13, 2026

BREAKING: సూర్యాపేట ‘హస్త’గతం!

image

సూర్యాపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 48 వార్డులకు గాను 31 చోట్ల ఘన విజయం సాధించి ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 11 స్థానాలకే పరిమితం కాగా, స్వతంత్రులు 5, బీజేపీ 1 చోట గెలుపొందాయి. ఈ భారీ విజయంతో కాంగ్రెస్ శ్రేణుల బాణసంచా పేలుళ్లు, మిఠాయిల పంపిణీతో జిల్లా కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది.

News February 13, 2026

GNT: తగ్గేదే’లే’ VS వదిలేదే’లే’.. పరిస్థితి ఎటుపోతుందో?

image

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈ నెల 26 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పటికే రెండు కేసుల్లో బెయిల్ లభించినప్పటికీ మరో కేసు నేపథ్యంలో ఆయన రిమాండ్‌కు వెళ్లారు. కోర్టు ప్రాంగణంలో ‘తగ్గేదేలే’ అన్నట్టు సైగ చేయడం చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో టీడీపీ నేతలు వరుస కేసులు నమోదుతో వదిలేదే ‘లే’ అన్నట్లు ఉంది. కేసులు ఇక్కడితో ఆగుతాయా లేదా కొనసాగుతాయా అన్నది జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై మీ COMMENT?