News August 14, 2025

జనగామ: ఇంకుడుగుంతల నిర్మాణం.. నెరవేరిన లక్ష్యం..!

image

కరవు ప్రాంతమైన జనగామ జిల్లాలో భూగర్భజల నీటి మట్టాన్ని పెంచేందుకు కలెక్టర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన జిల్లా మన నీరు’ కార్యక్రమం పండగలా సాగుతోంది. కలెక్టర్ పిలుపు మేరకు అధికారులు, విద్యార్థులతో పాటు ప్రజానీకం మేము సైతమంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. జిల్లాలో 5వేల ఇంకుడు గుంతల నిర్మాణమే లక్ష్యంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించగా.. 7 వేలకు పైగా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టడం విశేషం.

Similar News

News March 6, 2026

సూర్యాపేట: కేవైసీ ఉంటేనే ఉపాధి పనులు

image

వచ్చే నెల నుంచి ఉపాధి హామీ పథకంలో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా కూలీల హాజరు నమోదు చేయనున్నారు. ఈ-కేవైసీ పూర్తి చేసిన కూలీలకే పనులు కల్పించనున్నారు. ఎన్ఎంఎంఎస్ యాప్‌లో ప్రతి కూలీ ఫొటోను ఉదయం, మధ్యాహ్నం నమోదు చేసినప్పుడే వేతనాలు చెల్లించనున్నారు. జిల్లాలో 3,21,449మంది కూలీలు ఉండగా, అందులో 2,94,126 మంది (91.55%) ఈ-కేవైసీ పూర్తి చేశారు. హాజరు అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

News March 6, 2026

‘ప్రగతి పాలన’కు యాక్షన్ ప్లాన్ సిద్ధం: కలెక్టర్ ప్రావీణ్య

image

సంగారెడ్డి జిల్లాలో 99 రోజుల ‘ప్రగతి పాలన’ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించామని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మెదక్‌లో మంత్రి వివేక్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఆమె పాల్గొన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ఏర్పాట్లు చేశామన్నారు. ముఖ్యంగా ఆరోగ్యం, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ వెల్లడించారు.

News March 6, 2026

వెంకటగిరి విద్యార్థులకు లోకేశ్ అభినందనలు

image

వెంకటగిరి జడ్పీ స్కూల్ విద్యార్థులు మన్నవరం బస్సు కోసం వేచి ఉండగా పర్స్ దొరకడంతో పోలీసులకు <<19306615>>అప్పగించిన <<>>విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘బి.గురుప్రియ, బి.గీతిక, ఎం.గీతిక, ప‌ద్మ‌శ్రీ, హేమ‌ల‌త చెల్లెమ్మ‌లూ.. మీ నిజాయతీకి ఓ అన్నగా నేను గర్విస్తున్నా. మ‌న విద్యాశాఖ గౌర‌వాన్ని మ‌రింత ఇనుమ‌డింప‌జేశారు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చిట్టితల్లులు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.