News February 1, 2025

జనగామ: ఉరేసుకుని వ్యక్తి సూసైడ్

image

జనగామ జిల్లా కేంద్రంలోని బాణాపురం ఏరియాకి చెందిన డానియేలు(48) అనే వ్యక్తి చెట్టుకి ఉరేసుకుని మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 14, 2025

టెక్కలి: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

టెక్కలి ఆధి ఆంధ్రావీధి జాతీయ రహదారిపై ఉన్న ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత మంచినీటి పథకం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని ప్రాజెక్టు సిబ్బంది చూసి RWS అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 14, 2025

IPL ఫ్యాన్స్‌కు షాక్!

image

జియో సినిమా, డిస్నీ హాట్‌స్టార్ విలీనమై ‘జియో హాట్‌స్టార్’గా <<15456249>>ఏర్పడిన<<>> విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే IPL కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ‘జియో హాట్‌స్టార్’ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ‘హిందూస్థాన్ టైమ్స్’ కథనం ప్రకారం మ్యాచ్‌లు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. దీనికి 3 నెలలకు రూ.149 చెల్లించాల్సి ఉంటుంది. Ad Free ఆప్షన్ కోసం రూ.499 వెచ్చించాలి. MAR 22 నుంచి IPL ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

News February 14, 2025

ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

కడప జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మార్చి 1వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు పబ్లిక్ థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

error: Content is protected !!