News October 8, 2025

జనగామ: కోడ్ కూసే.. బిల్లులు నిలిచే..!

image

ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు ఆది నుంచి అవస్థలు పడుతున్నారు. మొదట్లో జాబితాలో పేరు రాకపోవడంతో ఆందోళన చెందిన పేదలు.. రీసర్వే చేసి అర్హులను ఎంపిక చేసింది. అయితే, జనగామ జిల్లాలోని లబ్ధిదారులు బయట నుంచి అప్పు తెచ్చుకొని ఇంటి నిర్మాణం చేపట్టారు. రూ.లక్షల్లో అప్పులు తెచ్చి ఇక్కట్లు పడుతున్నారు. ఎన్నికల కోడ్ కూయడంతో ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లుల కోసం నిరీక్షిస్తున్నారు.

Similar News

News January 13, 2026

కోడిపందేలపై ఫిర్యాదుకు కంట్రోల్ రూమ్!

image

హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలో కోడిపందేల నియంత్రణకు కాకినాడ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ మంగళవారం తెలిపారు. ఈ నెల 13 నుంచి 18 వరకు 0884-2356801 నంబర్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. పందేలపై వచ్చే ఫిర్యాదులపై తక్షణమే తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

News January 13, 2026

తిరుమలలో ఎల్లుండి నుంచి సుప్రభాత సేవ

image

తిరుమల శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు సాగిన ధనుర్మాస తిరుప్పావై పాశురాల పారాయణం బుధవారంతో ముగియనుంది. డిసెంబర్ 17వ తేదీ నుంచి శ్రీవారికి బిల్వ పత్రాలతో సహస్రనామార్చన, శ్రీవల్లి పుత్తూరు చిలుకలు అలంకరించి పూజలు చేస్తున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి యథావిధిగా వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొపుతారు.

News January 13, 2026

‘మన శంకరవరప్రసాద్ గారు’.. చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతంటే?

image

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి రూ.70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాలీవుడ్ టాక్. ఈ మూవీకి చిరు కూతురు సుష్మిత కో-ప్రొడ్యూసర్‌గా ఉన్న విషయం తెలిసిందే. కాగా 1992లో ఆపద్బాంధవుడు సినిమాకు రూ.కోటితో దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా మెగాస్టార్ రికార్డు సృష్టించారు. ఆచార్య, వాల్తేరు వీరయ్య సినిమాలకు రూ.50 కోట్లు, భోళా శంకర్‌కు రూ.63 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.