News March 7, 2025

జనగామ: చాకలి ఐలమ్మ మనువడి కుటుంబానికి కవిత ఫోన్

image

బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవడు, పాలకుర్తి మాజీ సర్పంచ్ చిట్యాల రామచంద్రం మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. రామచంద్రం మృతిపై తీవ్ర దిగ్భంతిని వ్యక్తం చేశారు. ఆయన ప్రజలకు చేసిన సేవను కొనియాడారు. తాము అండగా ఉంటామని, మనోధైర్యం కోల్పోవద్దని సూచించారు.

Similar News

News December 14, 2025

శివాజీ నగర్‌‌ సర్పంచ్‌గా సుక్కినే నాగరాజు

image

జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఫలితాలు వెలువడుతున్నాయి. దుగ్గొండి మండలం శివాజీ నగర్‌లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సుక్కినే నాగరాజు 92 ఓట్లతో విజయం సాధించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆయన అనుచరులు సంబరాలు జరుపుకొంటున్నారు.

News December 14, 2025

నాగర్‌కర్నూల్ జిల్లాలో తొలి సర్పంచ్ గెలుపు ఇక్కడే..!

image

బిజినేపల్లి మండలంలోని చిన్న పీర్‌ తాండా సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారు మునీందర్ నాయక్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి నూర్యపై ఆయన 70 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మండలంలోని 35 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మునీందర్ నాయక్ గెలుపు పట్ల తాండా గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

News December 14, 2025

ఆదిలాబాద్ జిల్లాలో తొలి ఫలితం

image

సాత్నాల మండలంలోని సాంగ్వి (జి) గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఆత్రం నగేశ్ గెలుపొందారు. ప్రత్యర్థిపై 389 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సర్పంచ్ నగేశ్‌ను పలువురు అభినందించారు.