News August 15, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తీరంగా ర్యాలీలు
> రేపు జనగామకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
> స్వతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్
> కలెక్టర్ ను కలిసిన శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ అవార్డు గ్రహీత
> జఫర్గడ్ పాక్స్ & డీసీసీబీ పాలకవర్గాల గడువు పొడగింపు
> పులివెందులలో జడ్పీటీసీ అభ్యర్థి గెలుపు పాలకుర్తిలో సంబరాలు
> రఘునాథపల్లిలో పర్యటించిన కలెక్టర్
Similar News
News March 16, 2026
అవతార్‌కు ఆస్కార్.. విమర్శలు!

అవతార్ ఫైర్ అండ్ యాష్‌కు విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఆస్కార్ దక్కింది. గతేడాది రిలీజైన ఈ చిత్రం ఆకట్టుకోలేదు. అయినా ఆస్కార్ రావడంపై కొందరు IND సినీ ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. హాలీవుడ్‌లో సినిమాలు ఎలా ఉన్నా ఆస్కార్ ఈజీగా వస్తుందని, భారతీయ చిత్రాలు ఎంత బాగా తీసినా ఇవ్వరని కామెంట్స్ చేస్తున్నారు. అయితే విజువల్ వండర్ కావడంతోనే అవతార్‌కు అవార్డు వచ్చిందని మరికొందరు అంటున్నారు. మీ కామెంట్?
News March 16, 2026
కామారెడ్డి జిల్లాలో భిన్న వాతావరణం

కామారెడ్డి జిల్లాలో భిన్న వాతావరణం నెలకొంది. ఓ వైపు ఎండలు మండుతుంటే.. మరోవైపు ఈదురుగాలులతో కూడిన ఉరుముల, మెరుపుల వడగళ్ల వాన పడింది. గడిచిన 24గంటల్లో నమోదైన వాతావరణ వివరాలిలా ఉన్నాయి. జుక్కల్ 39°C అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా 29 వెదర్ స్టేషన్లలో 35°C పైన, 3చోట్ల 30°C పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాంధారి(M)సర్వాపూర్ లో 8.5మి.మీ నమోదు కాగా పలు మండలాల్లో సైతం వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.
News March 16, 2026
మేడ్చల్: 793 అంగన్వాడీల్లో ఒంటిపూట బడులు

మంత్రి సీతక్క ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లాలోని 793 అంగన్వాడీ కేంద్రాలలో ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 23వ తేదీ వరకు ఈ కేంద్రాలు ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. చిన్నారులకు విద్యాబోధనతో పాటు పౌష్టికాహారం అందించి ఇంటికి పంపించనున్నారు.


