News November 7, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే
> బ్రిడ్జ్ నిర్మించాలని సీపీఎం నేతల ధర్నా
> విద్యార్థులతో వాలీబాల్ ఆడిన ఎమ్మెల్యే కడియం
> వరి పంటలను పరిశీలించిన కలెక్టర్
> బచ్చన్నపేట: డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి
> జనగామలో డివైఎఫ్ఐ 46వ దినోత్సవ వేడుకలు
> కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
Similar News
News January 19, 2026
హైదరాబాద్‌లో కొత్త ట్రెండ్.. ‘పబ్బుల్లో పాఠాలు’

సిటీ కుర్రాళ్ల సోషల్ లైఫ్ ఇప్పుడు రూటు మార్చింది. వీకెండ్ వస్తే కేవలం డాన్స్ ఫ్లోర్ల మీద స్టెప్పులేయడమే కాదు.. చేతిలో బీర్ గ్లాసు పట్టుకొని ‘స్ట్రింగ్ థియరీ’ వంటి కఠినమైన సైన్స్ ముచ్చట్లు వినడం ఇప్పుడు GEN-Zలో కొత్త క్రేజ్. ‘పింట్ ఆఫ్ వ్యూ’ వంటి ఈవెంట్లే దీనికి సాక్ష్యం. సైన్స్, హిస్టరీ, క్వాంటం ఫిజిక్స్ వంటి సీరియస్ విషయాలను చిల్ అవుతూ నేర్చుకోవడానికి మన HYD కుర్రాళ్లు బాగా ఇష్టపడుతున్నారు.
News January 19, 2026
నారాయణపేట: ‘వేసవిలో తాగునీటి ఎద్దడి రానీయొద్దు’

NRPT జిల్లాలో వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ నీరు అందేలా చూడాలని, నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని సూచించారు. సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
News January 19, 2026
ప్రకాశం: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 27 నుంచి జరగనున్న ప్రాక్టికల్స్, ఫిబ్రవరి 23 నుంచి జరగనున్న పబ్లిక్ ఎగ్జామ్స్‌కు సంబంధించి ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల సందేహాలకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆర్ఐఓకు ఆదేశాలు జారీ చేశారు.


