News August 14, 2025
జనగామ జిల్లాలో మత్తడి పోస్తున్న చెరువులు, కుంటలు

భారీ వర్షాలతో జనగామ జిల్లాలో చెరువులు, కుంటలు మత్తడి పోస్తున్నాయి. జిల్లాలో 779 చెరువులు ఉండగా 96 చెరువులు పూర్తి స్థాయిలో మత్తడి పోస్తున్నాయి. మరో 126 చెరువుల్లో 80 శాతానికి నీరు వచ్చి చేరింది. జనగామ నియోజకవర్గంలోని పలు రిజర్వాయర్లలో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. వీటి పరిధిలో లక్ష ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 6, 2026
అనకాపల్లి: ఇంటర్ పరీక్షకు 208 మంది గైర్హాజర్

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 208 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. 6,575 మంది హాజరు కావలసి ఉండగా 6,367 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. పరీక్షలు పకడ్బందీగా, ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
News March 6, 2026
తుఫానులకు నష్టం జరగకుండా చర్యలు: హోంమంత్రి

భవిష్యత్తులో వచ్చే తుఫానులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శుక్రవారం శాసనమండలిలో మాట్లాడుతూ 2014-19 మధ్య సీఎం చంద్రబాబు 219 తుఫాన్ షెల్టర్లను నిర్మించినట్లు పేర్కొన్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఒక్కటి కూడా నిర్మించలేదన్నారు. పైగా డిజాస్టర్ మేనేజ్మెంట్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు.
News March 6, 2026
దూసుకెళ్తున్న బాలెన్ షా పార్టీ

నేపాల్ పార్లమెంట్ ఎన్నికల <<19309327>>ఫలితాల్లో<<>> రాష్ట్రీయ స్వతంత్రత పార్టీ(RSP) దూసుకెళ్తోంది. 68 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ప్రత్యర్థులు దీనికి దరిదాపుల్లో కూడా లేరు. మాజీ PM కేపీ ఓలీ పార్టీ 5 సీట్లతో మూడో స్థానానికి పడిపోయింది. గగన్ కుమార్ థాపా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ 9 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. దీన్ని బట్టి బాలెన్ షాకు చెందిన RSP ఫుల్ మెజార్టీతో అధికారం చేపట్టనున్నట్లు స్పష్టమవుతోంది.


