News October 5, 2025

జనగామ జిల్లా వ్యాప్తంగా 138.2 మీ.మీ వర్షపాతం

image

జనగామ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 138.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని పాలకుర్తిలో 35.4, ఘనపూర్ (స్టేషన్)లో 30.6, జఫర్‌గఢ్‌ 29.4, కొడకండ్ల 28.4, తరిగొప్పుల (6.2), నర్మెట్ట (3.4), జనగామ (3.0), రఘునాథపల్లి (1.8) చిల్పూర్ 0.0, బచ్చన్నపేట0.0, లింగలఘనపూర్ 0.0 మీ. మీ, దేవరుప్పుల 0.0 వర్షపాతం నమోదయిందన్నారు.

Similar News

News January 23, 2026

జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా TN అసెంబ్లీలో తీర్మానం

image

జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేసిన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు చేరింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో సీఎం స్టాలిన్ తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు. ఉపాధి హామీ చట్టానికి మహాత్మాగాంధీ పేరు తీసేసి జీ రామ్ జీగా మార్చడాన్ని DMK వ్యతిరేకిస్తూ వస్తోంది. తాజాగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇప్పటికే పంజాబ్, TG ప్రభుత్వాలు ఈ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేసిన విషయం తెలిసిందే.

News January 23, 2026

ఇద్దరు హంతకులు.. జైలులో ప్రేమ.. పెరోల్‌తో పెళ్లి!

image

ఇద్దరు హంతకుల మధ్య జైలులో చిగురించిన ప్రేమ పెరోల్‌తో పెళ్లి పీటలెక్కింది. డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువకుడి హత్య కేసులో ప్రియా సేథ్ జీవిత ఖైదు అనుభవిస్తోంది. ప్రియురాలి భర్త, ఆమె ముగ్గురు పిల్లలు, మరో వ్యక్తిని చంపిన కేసులో హనుమాన్ ప్రసాద్ జైలులో ఉన్నాడు. ప్రియ, ప్రసాద్ మధ్య సంగనేర్‌(RJ) ఓపెన్ జైలులో ప్రేమ చిగురించింది. వీరికి 15రోజుల అత్యవసర పెరోల్‌ను RJ హైకోర్టు మంజూరు చేసింది. నేడు వీరి వివాహం.

News January 23, 2026

తూ.గో జిల్లా అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

తూర్పుగోదావరి జిల్లాల్లోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ మొదటి ఏడాది సీట్ల భర్తీకి దరఖాస్తులను తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 19లోపు https://apbragcet.apcfss.in వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్చి 1, 2 తేదీల్లో ప్రవేశ పరీక్షలు ఉంటాయి.