News September 12, 2025
జనగామ జిల్లా వ్యాప్తంగా 53.9 మి.మీ వర్షపాతం

జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 53.9 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తరిగొప్పుల 55.8, చిల్పూర్ 68.6, జఫర్‌గఢ్ 36.8, స్టేషన్ ఘనపూర్ 74.4, రఘునాథపల్లి 94.2, నర్మెట్ట 19.2, బచ్చన్నపేట 119.6, జనగామ 68.4, లింగాల ఘనపూర్ 74.2, దేవరుప్పుల 11.4, పాలకుర్తి 21.2, కొడకండ్ల 2.4 మి.మీ వర్షపాతం నమోదయిందన్నారు.
Similar News
News December 17, 2025
గొల్లపల్లి : పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా ఎస్పీ

గొల్లపల్లి (M) ఇబ్రహీంనగర్, గొల్లపల్లి, పెగడపల్లి (M) బతికపల్లి, నంచర్ల గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను బుధవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News December 17, 2025
జగిత్యాల: ముగిసిన పోలింగ్.. అభ్యర్థుల్లో టెన్షన్

జగిత్యాల జిల్లాలోని 6 మండలాలలో మూడో విడత జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంటతో ముగిసింది. క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభం కానుండడంతో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులలో టెన్షన్ నెలకొంది. ఇన్ని రోజులు కష్టపడ్డ తమకు ఫలితం ఎలా దక్కుతుందోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
News December 17, 2025
వెల్గటూర్: శాంతియుత ఎన్నికలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి

వెల్గటూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలింగ్ నిర్వహణ తీరు, భద్రతా ఏర్పాట్లు, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా చూడాలన్నారు.


