News March 5, 2025
జనగామ: నేడే పరీక్షలు.. ALL THE BEST

జనగామ జిల్లా వ్యాప్తంగా 8,945 మంది విద్యార్థులు నేడు ఇంటర్ పరీక్ష రాయనున్నారు. ఫస్టియర్ 4,251, సెకండియర్‌లో 4,694 మంది విద్యార్థులు రాయనుండగా.. 17 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, బీఎన్ఎన్ఎస్ 163(144) చట్టం అమలులో ఉంటుందని సీపీ అంబర్ కిషోర్ ఘూ తెలిపారు. కాగా, పరీక్షకు 30 నిమిషాలకు ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోండి.
ALL THE BEST
Similar News
News December 17, 2025
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 21.49% పోలింగ్

కామారెడ్డి జిల్లాలో మూడో విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. ఇప్పటివరకు 40,890 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు ఆయా మండలాల్లో నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.
బాన్సువాడ-19.90%
బీర్కూర్-18.23
బిచ్కుంద-27.70%
పెద్దకొడప్గల్-27.15%
మద్నూర్-14.70%
డోంగ్లి-25.43%
జుక్కల్-21.07%
నస్రుల్లాబాద్-21.90%
పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
News December 17, 2025
NLG: ‘యూరియా కట్టడికి ప్రభుత్వం చర్యలు’

యాసంగి సీజన్‌లో రైతులకు యూరియా అందించడంతో పాటు యూరియా వినియోగాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నూతనంగా యూరియా బుకింగ్ యాప్‌ను తీసుకొచ్చింది. దీంతో రైతులు యాప్‌లో ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈనెల 20 నుంచి ఈ యాప్‌ను అందుబాటులో తీసుకొచ్చేలా జిల్లా వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తుంది.
News December 17, 2025
@9AM.. పోలింగ్ శాతం ఎంతంటే?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.
★ వరంగల్: 22.26%
★ హనుమకొండ: 21.52%
★ ములుగు: 20.96%
★ భూపాలపల్లి: 26.11%
★ జనగాం: 22.51%
★ మహబూబాబాద్: 27.49%
➤ మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరుగుతుంది. మ.2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.


