News November 6, 2025

జనగామ: పత్తి అమ్మకంలో రైతుల ఇక్కట్లు!

image

జిల్లాలోని ఆయా మండలాల పత్తి రైతులు పత్తి అమ్మకంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలో తెలియకపోవడం, ఎకరానికి 7 క్వింటాల పత్తి మాత్రమే అమ్మకంలో చూపించడం, ఎంత భూమి పత్తి పై ఉందో, ఎంత భూమి వరిపై ఉందో తెలియక సతమతమవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోని కిసాన్ కపాస్ యాప్‌లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చి పత్తి అమ్మకం సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News January 15, 2026

మురిపించిన వేళ్ల విన్యాసం.. పరవశించిన ముంగిళ్లు

image

కామారెడ్డి జిల్లావ్యాప్తంగా సంక్రాంతి పండుగ వేడుకలు సంబరంగా జరిగాయి. జిల్లాలోని ప్రతి ఇల్లూ కొత్త అల్లుళ్లు, బంధువుల రాకతో కళకళలాడింది. ముగ్గుల పోటీలు, సంప్రదాయ అలంకరణలు ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యువతులు, చిన్నారులు తమ వేళ్ల విన్యాసంతో ముంగిళ్లను మురిపించారు. ప్రతి ఇంట్లో పిండివంటల ఘుమఘుమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గారెలమ్మలు, అరిసెలు, సకినాల వాసనలతో వాడలన్నీ నిండిపోయాయి.

News January 15, 2026

కొత్తకొండ జాతరకు కొత్తపల్లి ఎడ్ల రథాలు!

image

భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామం నుంచి గత 60 ఏళ్లుగా కొత్తకొండ జాతరకు రథాలు బయల్దేరడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ప్రతి ఏడాది సుమారు 80 ఎడ్ల బండ్లతో రథయాత్ర సాగుతుంది. కొత్తపల్లి నుంచి కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయానికి చేరుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోతాయి. ఈ సంప్రదాయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

News January 15, 2026

లింకులను క్లిక్ చేస్తే బుక్ అయినట్లే: ఎమ్మిగనూరు సీఐ

image

వాట్సాప్ గ్రూపులలో ‘నాకు రూ.5 వేలు వచ్చాయి. నేను నకిలీ అనుకున్నాను. మీరూ ప్రయత్నించి చూడండి. మీరు పది మందికి ఈ లింకును ఫార్వర్డ్ చేయండి’ అని వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని ఎమ్మిగనూరు CI శ్రీనివాసులు పేర్కొన్నారు. సైబర్‌ నేరగాళ్లు ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, తదితర మాధ్యమాల నుంచి వచ్చే లింకులు ఓపెన్‌ చేయొద్దన్నారు.