News May 7, 2025
జనగామ: రేపే BRS రజతోత్సవ సభ

WGL ఎల్కతుర్తిలో నిర్వహించనున్న BRS రజతోత్సవ సభకు మరో ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. 10 నుంచి 15 లక్షల మందితో 1,250 ఎకరాల్లో రేపు ఈసభ జరగనుంది. 500మందికి సరిపడే విధంగా బాహుబలి వేదికను నిర్మించారు. 10లక్షల మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ల బాటిల్లు, రెండున్నరవేల మందికి పైనే వాలంటర్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. వెయ్యి ఎకరాలను 5 జోన్లుగా విభజించి పార్కింట్ ఏర్పాటు చేశారు. సభకు మీరు వెళ్తున్నారా? కామెంట్
Similar News
News February 13, 2026
వడ్డేపల్లి మున్సిపాలిటీ 10 మంది కౌన్సిలర్లు వీరే..!

1వ వార్డు పావని AIFB
2వ వార్డు సరందా AIFB
3వ వార్డు వెంకట్రామన్ కాంగ్రెస్
4వ వార్డు మంజుల AIFB
5వ వార్డు యుగంధర్ రెడ్డి AIFB
6వ వార్డు దేవమ్మ AIFB
7వ వార్డు విజయ్ భాస్కర్ AIFB
8వ వార్డు నంబి జయశ్రీ AIFB
9వ వార్డు పొలుకల్ సూరి BRS
10వ వార్డు తిమ్మప్ప AIFB గెలుపొందారు.
News February 13, 2026
వరంగల్: మార్కెట్‌కు 4 రోజులు సెలవులు

ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈ నెల 14 శనివారం నుంచి 17వ తేదీ మంగళవారం వరకు వరుసగా నాలుగు రోజుల సెలవులు ఇచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు. శనివారం వారాంతపు సెలవు, ఆదివారం మహాశివరాత్రి పర్వదిన సెలవు, సోమవారం జాగారం సెలవు, మంగళవారం అమావాస్య సెలవు కారణంగా మార్కెట్‌కు వరుస సెలవులు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 18 బుధవారం నుంచి మార్కెట్ ప్రారంభమవుతుందని రైతులు గమనిచాలన్నారు.
News February 13, 2026
ఆలిండియా రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్ రీడర్

జోలెపాళ్యం మంగమ్మ 1925 సెప్టెంబర్ 12న మదనపల్లెలో జన్మించారు. ఆలిండియా రేడియో పరీక్షల్లో ఉత్తీర్ణురాలై 1960లో రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్ రీడర్, ఎడిటర్‌గా పనిచేశారు. కేంద్ర సమాచారశాఖ, విదేశాంగశాఖల్లో కీలకపదవులతో పాటు పరిశోధనలు, పుస్తక రచనలో అనేక అవార్డులు వరించాయి. ఆంధ్రానైటింగేల్ బిరుదు పొందారు. ఈమెకు తెలుగు, ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఎస్పరాంటో, తమిళ, హిందీ భాషల్లో ప్రావీణ్యం, బోధనలో అనుభవం ఉంది.


