News October 6, 2025

జనగామ: రేబీస్ వ్యాధితో బాలుడు మృతి

image

రేబీస్ వ్యాధితో బాలుడు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మైదం శ్రీనివాస్ బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. ఇటీవల శ్రీనివాస్ కొడుకు చరణ్(10)ను వీధి కుక్క కరవడంతో స్థానికంగా చికిత్స చేయించారు. రెండు రోజుల క్రితం రేబీస్ లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చరణ్ మృతి చెందాడు.

Similar News

News January 14, 2026

ఈ గ్రామంలో సంక్రాంతి పండుగే జరపరు

image

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి హడావుడి మాములుగా ఉండదు. కానీ, అనంతపురం(D) పి.కొత్తపల్లి గ్రామంలో ఈ పండుగే చేయరు. ఈ మూడ్రోజులు ముగ్గులు వేయడం, ఇల్లు తుడవడం వంటి పనులేం చేయరు. విచిత్రమేంటంటే కొందరు స్నానాలు కూడా చేయరట. పూర్వం సంక్రాంతి సరుకుల కోసం సంతకు వెళ్లిన గ్రామస్తులు వరుసగా మరణించడంతో, ఈ పండుగ తమకు అరిష్టమని వారు నమ్ముతారు. అందుకే తరాలు మారినా నేటికీ అక్కడ పండుగ చేసుకోరు.

News January 14, 2026

GNT: కిటకిటలాడుతున్న సరస్ ప్రదర్శన ప్రాంగణం

image

గుంటూరులో జరుగుతున్న సరస్ మేళా-2026 అఖిల భారత డ్వాక్రా బజారుకు విశేమైన ఆదరణ లభిస్తోంది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో సందర్శకులు స్టాళ్లను సందర్శిస్తున్నారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన స్టాల్స్ మాత్రమే కాకుండా సందర్శకుల కోసం సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. ఉత్పత్తులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఆలరిస్తున్నాయని సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News January 14, 2026

చిత్తూరుకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్

image

తవణంపల్లి: తెల్లగుండ్లపల్లి ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణం వందలూరు గ్రామానికి చెందిన కే. బుజ్జమ్మ (45) భర్త మురుగయ్య‌తో కలిసి బైకుపై చిత్తూరుకు వెళ్లి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బుజ్జమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, మురుగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మురుగయ్యను చికిత్స నిమిత్తం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు.