News February 7, 2025
జనగామ: రోడ్ల విస్తరణకు ప్రతిపాదనలు సమర్పించాలి: కలెక్టర్

రోడ్లు & భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ రాష్ట్ర రోడ్ల నిర్మాణ & విస్తరణ వ్యవస్థపై నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రిజ్వన్ భాషా షేక్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధాని వరకు నాలుగు లైన్ల రోడ్డు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల వరకు డబుల్ లైన్ రోడ్ల విస్తరణకు ప్రతిపాదనలు పంపించాలన్నారు.
Similar News
News February 14, 2026
BHPL: గవర్నమెంట్ జాబ్‌కు రాజీనామా.. చివరికి ఓటమి!

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 11వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా హరీష్ పోటీ చేసి ఓటమి చెందారు. హరీష్ పంచాయతీ శాఖలో గ్రామ పంచాయతీ కార్యదర్శిగా కాంట్రాక్టు ఉద్యోగంలో పనిచేసేవాడు. మూడున్నర సంవత్సరాల పాటు ఉద్యోగంలో పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి కౌన్సిలర్‌గా పోటీ చేశాడు. దీంతో హరీష్‌కు కేవలం 81 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉద్యోగాన్ని వదిలి సేవ చేసేందుకు వచ్చినా వార్డు ప్రజలు ఆదరించలేదు.
News February 14, 2026
జనగామ మున్సిపాలిటీలో వికసించని కమలం!

జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా 26 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. కానీ, ఏ వార్డులో కూడా గట్టి పోటీ ఇచ్చిన దాఖలాలు లేవని పట్టణంలో చర్చ జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్నా.. మున్సిపాలిటీలో ఒక్క సీటు కూడా సంపాదించుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 26 వార్డుల్లో రెండు వార్డులు గెలుస్తాయనే ధీమా ఉన్నా.. జిల్లా అధ్యక్షుడి కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఓడిపోయారని చర్చ జరుగుతోంది.