News September 11, 2025
జన్నారంలో పులి సంచారంపై ఎఫ్‌డీఓ స్పష్టత

జన్నారం అటవీ ప్రాంతంలో పులి సంచారం నిజం కాదని స్థానిక FDO రామ్మోహన్ రావు స్పష్టం చేశారు. ఇటీవల సింగరాయిపేట నుంచి దొంగపల్లి మార్గంలోని బ్రిడ్జిపై పులి ఉన్నట్లు ఒక వీడియో వాట్సాప్‌లో వైరల్ అయింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఆ మార్గంలో అలాంటి బ్రిడ్జి లేదని, వైరల్ అవుతున్న వీడియో ఐదేళ్ల క్రితం నాటిదని చెప్పారు. ప్రజలు అలాంటి వీడియోలను నమ్మవద్దని ఆయన సూచించారు.
Similar News
News December 14, 2025
వనపర్తి జిల్లాలో తొలి సర్పంచ్ గెలుపు ఇక్కడే!

అమరచింత మండల పరిధిలోని అమరచింత ఆర్ఆర్ సెంటర్ సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుదారురాలు విజయభారతి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి చిన్న మునిప్పపై ఆమె 90 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు గాను, 2 ఏకగ్రీవం కాగా, మిగిలిన 12 పంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
News December 14, 2025
రాజనగర్ సర్పంచ్‌గా బీఆర్ఎస్ మద్దతుదారు గెలుపు

రాయికల్ మండలం రాజనగర్ గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారు భారతపు రాజేష్ ఘన విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థి సిరిపురపు రాములుపై 380 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అదే గ్రామంలో 8 వార్డ్‌ల సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషంగా నిలిచింది. ప్రజల విశ్వాసంతో గ్రామాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని సర్పంచ్ భారతపు రాజేష్ ఈ సందర్భంగా తెలిపారు.
News December 14, 2025
లేటెస్ట్ మూవీ అప్‌డేట్స్

✦ 2026, జనవరి 1న వెంకటేశ్ హీరోగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా థియేటర్లలో రీరిలీజ్
✦ ఈరోజు సా.6.30 గంటలకు ‘రాజాసాబ్’ నుంచి ‘సహానా సహానా’ పాట ప్రోమో విడుదల.. పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ టీమ్
✦ ‘మోగ్లీ’ సినిమాకు తొలి రోజు రూ.1.22 కోట్ల కలెక్షన్స్
✦ డిసెంబర్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం?


