News February 7, 2025

జయపురం గ్రామంలో విచారణ నిర్వహించిన ఎస్సై

image

నర్సింహులపేట మండలంలోని జయపురం గ్రామంలో నిన్న దళిత యువకులను గుడిలోకి రానివ్వకపోవడంతో ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో దళిత సంఘాల నాయకులు ఇచ్చిన ఫిర్యాదు చేసిన మేరకు స్థానిక ఎస్ఐ సురేశ్ గ్రామంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని ప్రజలను ఘటన గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News February 17, 2026

హార్దిక్ పాండ్య ‘రుద్ర’ వాచ్ గురించి తెలుసా?

image

శివరాత్రి రోజున <<19153355>>పాక్‌తో జరిగిన<<>> మ్యాచ్‌లో భారత ప్లేయర్ హార్దిక్ పాండ్య ధరించిన వాచ్‌పై నెట్టింట చర్చ జరుగుతోంది. జాకబ్ అండ్ కో సంస్థ ‘రుద్ర’ పేరుతో వీటిని తయారు చేస్తోంది. ఒక్కోటి రూ.25 లక్షల వరకు ఉంటుందని, ప్రపంచంలో 25 పీసులే ఉన్నాయని తెలుస్తోంది. వాచ్ డిస్‌ప్లేపై ధ్యానంలో ఉన్న శివుడు, ఓం, గుడి చిత్రాలున్నాయి. 41 MM గ్రేడ్ 5 టైటానియం కేస్‌తో ఇది తయారైంది. 70 గంటలపాటు పవర్ రిజర్వ్ ఉంటుంది.

News February 17, 2026

జగిత్యాల MLAపై ముప్పేటదాడి.. అయినా ధైర్యంగా ముందుకు..!

image

JGTL MLA సంజయ్‌పై వివిధ పార్టీల నేతలు రోజూ ముప్పేటదాడికి దిగారు. అయినా చలించకుండా తనపని తాను చేసుకుంటూ వెళ్లారు. పార్టీ మారావంటూ, ఎందులో ఉన్నావో చెప్పాలంటూ BRS ఎద్దేవ చేసినా, ఆ పార్టీ MLAలు మా సంసారంలో వేలెందుకు పెడతావన్నా, కాంగ్రెస్ నేతలు అవమానించినా వేరవలేదు. చివరకు కాంగ్రెస్ కౌన్సిలర్ల తరఫున MLA ప్రచారం చేసి తన వర్గాన్ని గెలిపించుకొని మున్సిపల్ ఛైర్మన్‌ చేసి ప్రత్యర్థులకు గట్టి సమాధానం ఇచ్చారు.

News February 17, 2026

నేటితో శుక్ర మౌఢ్యమి ముగింపు

image

గతేడాది నవంబర్ 26వ తేదీన మొదలైన శుక్ర మౌఢ్యమి నేటితో ముగియనుంది. ఇన్నాళ్లూ అస్తమయ స్థితిలో ఉన్న శుక్రుడు రేపటి నుంచి తిరిగి శుభప్రదమైన స్థితిలోకి వస్తాడు. దీంతో నిలిచిపోయిన శుభ కార్యాలు రేపటి నుంచి మళ్లీ మొదలవుతాయి. వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు వంటి విలువైన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా, నిశ్చింతగా నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు.