News June 7, 2024
జర్నలిస్టుల సహకారం మరువలేనిది: విశాఖ కలెక్టర్
ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో జిల్లా యంత్రాంగానికి జర్నలిస్టులు ఎంతో సహకరించారని, పొరపాట్లు జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారని కలెక్టర్ మల్లికార్జున పేర్కొన్నారు. ఎన్నికల జాబితా రూపకల్పన, సవరణ ప్రక్రియకు సంబంధించి అనేక కథనాలు ప్రచురించడం ద్వారా పొరపాట్లను సవరించేలా యంత్రాంగానికి మార్గదర్శకం చేశారన్నారు. వివిధ మార్గాల్లో జిల్లా యంత్రాంగానికి సహకారం అందించిన జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News December 5, 2024
అనకాపల్లి: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
అనకాపల్లి జిల్లా పరిధిలో నేషనల్ హైవే, స్టేట్ హైవేలపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు SDPO శ్రావణి పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి నేషనల్ హైవే పై బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి ప్రమాదాలు జరగడానికి గల కారణాలను విశ్లేషించారు. లోటుపాట్లను తెలుసుకొని వాటిని సరిదిద్ది ప్రమాదాల నివారణకు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో కృషి చేస్తామన్నారు.
News December 4, 2024
సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన షెడ్యూల్
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 5న విశాఖ రానున్న విషయం తెలిసిందే. విశాఖలో సీఎం పర్యటన షెడ్యూల్‌ను సీఎంవో తెలిపింది. ఈనెల 5న సాయంత్రం 9.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్ కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 6వ తేదీన విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలపై సీఎం సమీక్షిస్తారు.
News December 4, 2024
విశాఖ-చెన్నై ఎగ్మోర్-విశాఖ స్పెషల్ రైళ్లు
ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ-చెన్నై ఎగ్మోర్-విశాఖ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు డీసీఎం కె.సందీప్ తెలిపారు. విశాఖ చెన్నై ఎగ్మోర్ స్పెషల్ ట్రైన్ ఈనెల 7 నుంచి వచ్చే ఏడాది మార్చి 1వ తేదీ వరకు ప్రతి శనివారం నడుపుతున్నట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో చెన్నై ఎగ్మోర్ నుంచి విశాఖకు ఈనెల 8 నుంచి మార్చి 2వ తేదీ వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుందన్నారు.