News December 12, 2024
జర్నలిస్టు రంజిత్‌కు జెగోమేటిక్ బోన్ సర్జరీ
నటుడు మోహన్ బాబు చేతిలో దాడికి గురైన జర్నలిస్ట్ రంజిత్‌కు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో గురువారం జైగోమేటిక్ బోన్ సర్జరీ చేశారు. సర్జరీ విజయవంతమైందని, రంజిత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. జైగోమాటిక్ బోన్‌కు మొత్తం 3 పొరల్లో ఫ్రాక్చర్స్ ఏర్పడగా.. సర్జరీ చేసి ప్లేట్‌లు అమర్చినట్లు వైద్యులు వెల్లడించారు.
Similar News
News January 26, 2025
బీబీనగర్ ఎయిమ్స్‌లో అరుదైన శాస్త్రచికిత్స
బీబీనగర్ ఎయిమ్స్‌లో పీడియాట్రిక్ సర్జరీ ప్రొఫెసర్ (డాక్టర్) వికాస్ భాటియా మార్గదర్శకత్వంలో సంక్లిష్టమైన కేసులను విజయవంతంగా నిర్వహించారు. వెస్టిజియల్ మానవ తోకను శనివారం శస్త్రచికిత్స ద్వారా తొలగించినట్లు ఇది గొప్ప విజయమని ఆయన తెలిపారు. గతేడాది ఇలాంటివే 2 శస్త్రచికిత్సలు జరిగాయని. పిల్లలకు సమస్యలను బట్టి అత్యాధునిక శస్త్రచికిత్సలు, సంరక్షణను అందించడంలో ఎయిమ్స్ డాక్టర్లు ముందుంటారని అన్నారు.
News January 26, 2025
బేగంపేట్ ప్రజాభవన్‌లో గణతంత్ర వేడుకలు
గణతంత్ర దినోత్సవం ప్రజా భవన్‌లో ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పోలీసుల గౌరవార్థం స్వీకరించి పాల్గొని జెండా ఆవిష్కరించారు. మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత అధికారులు, ప్రజాభవన్ సిబ్బంది పాల్గొన్నారు.
News January 26, 2025
త్రివర్ణ శోభతో జంట నగరాలు
గణతంత్ర దినోత్సవం రైల్వే స్టేషన్‌లకు కొత్త శోభను తెచ్చిపెట్టింది. నిన్న సికింద్రాబాద్ రైల్ నిలయం, సికింద్రాబాద్ సౌత్ సెంటర్ రైల్వే స్టేషన్‌లను 3 రంగుల జాతీయ జెండా రంగుల విద్యుత్ దీపాలతో చూడ ముచ్చటగా అలంకరించారు. అలాగే నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేష త్రివర్ణ శోభతో జిగేల్ మంటున్నాయి. ఈ అలంకరణ ప్రయాణికులను ఆకట్టుకుంది.