News April 13, 2025

జలపాతంలో పూర్ణామార్కెట్ యువకులు గల్లంతు

image

అనకాపల్లి జిల్లా సరిహద్దులోని సరియా జలపాతంలో ఆదివారం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. విశాఖ పూర్ణ మార్కెట్‌కు చెందిన ఆరుగురు స్నేహితులు జలపాతం చూసేందుకు రాగా, వారిలో ఇద్దరు జలపాతంలో గల్లంతయ్యారు. దేవరాపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు ఇద్దరు యువకులు వెళ్ళగా.. ఘటనా ప్రదేశం అనంతగిరి పీఎస్ లిమిట్స్‌లో ఉందని తెలుసుకుని అక్కడ ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 23, 2026

రూర్కెలా-జగదల్‌పూర్ ట్రైన్‌కు అదనపు బోగీ

image

రూర్కెలా-జగదల్‌పూర్ (ట్రైన్ నంబర్ 18107)కి అదనపు భోగిని ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రద్దీని అదుపు చేసేందుకు గాను తాత్కాలికంగా ఒక స్లీపర్ క్లాస్‌ భోగిని అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News January 23, 2026

ప్ర‌తిష్ఠాత్మ‌కంగా విశాఖ ఉత్సవాలు: కలెక్టర్

image

విశాఖ ఉత్సవాలు ఈనెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలు సజావుగా, ప్రజలకు ఆకర్షణీయంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఉత్సవాల నిర్వహణ, భద్రత, ట్రాఫిక్, పార్కింగ్, పారిశుద్ధ్యం, విద్యుత్, అగ్నిమాపక, వైద్య సేవలపై సమీక్షించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉత్సవాలను నిర్వహించాలన్నారు.

News January 23, 2026

నేరాల నియంత్రణపై సీపీ సమీక్ష

image

విశాఖ నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళా భద్రత, గంజాయి రవాణా అడ్డుకట్ట, సైబర్ నేరాల నియంత్రణలో సాంకేతికత వాడకంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రౌడీ షీటర్లపై నిఘా పెంచాలని, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో నగర DCPలు,ఉన్నతాధికారులు పాల్గొన్నారు.