News March 26, 2024
జహీరాబాద్: అడవిలో అస్థిపంజరం..!

జహీరాబాద్ మం. తూముకుంట గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని అస్థిపంజరం లభ్యమైనట్లు రూరల్ SI ప్రసాద్ రావు తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఫారెస్ట్ అధికారులు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లినట్లు పేర్కొన్నారు. 60 నుంచి 65 సంవత్సరాల మధ్యగల వృద్ధుడి మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి, ఎముకల మాత్రమే మిగిలినట్లు గుర్తించామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు SI వివరణ ఇచ్చారు.
Similar News
News February 7, 2026
మెదక్: మున్సిపల్ బరిలో న్యాయవాది

మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో యువ న్యాయవాది జీవన్ రావు పోటీ చేస్తున్నారు. 2016లో లా పట్టా అందుకున్న జీవన్ రావు ప్రస్తుతం మెదక్ కోర్టులో ప్రాక్టీస్ నిర్వహిస్తున్నారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలోని 7వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా జీవన్ రావు సతీమణి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి 6వ వార్డు రిజర్వేషన్ అనుకూలంగా రావడంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.
News February 7, 2026
మెదక్: క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి: ఏఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పరేడ్ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్ పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం, ఆరోగ్య పరిరక్షణపై సూచనలు చేశారు. ప్రతి పోలీసు రోజూ వ్యాయామం చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు. చట్టం అందరికీ సమానమని, చట్ట వ్యతిరేకులకు ఎలాంటి మినహాయింపులు ఉండవని హెచ్చరించారు.
News February 6, 2026
మెదక్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

అంత్యక్రియలకు వచ్చి తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందాడు. మేడ్చల్ జిల్లా కొనాయిపల్లికి చెందిన గుంటి నవీన్ కూచారంలో అంత్యక్రియలకు హాజరై బైక్‌పై వెళ్తున్నాడు. కాళ్లకల్ మైకో కంపెనీ వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


