News January 23, 2025

జాతీయ ఉత్తమ జర్నలిస్టుల అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్

image

ఉత్తమ జర్నలిస్టు జాతీయ పురస్కారాలు-2024 అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ కోరారు. వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా-2024 సంవత్సరానికి పాత్రికేయ పురస్కారాలు అందించేందుకు ఈ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతిభావంతులైన జర్నలిస్టులను గుర్తించడంలో భాగంగా జాతీయస్థాయిలో ఉత్తమ జర్నలిస్టులను ఎంపిక చేసి జర్నలిజం విలువలను మరింత బలోపేతం చేస్తుందని కలెక్టర్ చెప్పారు.

Similar News

News February 16, 2025

ఐఏఎస్ అయ్యి సేవ చేస్తా: జైకిసాన్

image

అల్లూరి జిల్లా వై.రామవరం మండలం కోట గ్రామానికి చెందిన కె.జైకిసాన్ JEE మెయిన్స్‌లో సత్తా చాటాడు. ఈ గిరిజన విద్యార్థి 97 పర్సంటైల్ స్కోర్‌తో ఎస్‌టి విభాగంలో జాతీయ స్థాయి ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నాడు. ఐఏఎస్ అయ్యి గిరిజన గ్రామాల్లో సేవ చేయాలన్నదే తన ఆశయమని తెలిపాడు. జైకిసాన్ తండ్రి లక్ష్మణరావు రంపచోడవరం మండల అగ్రికల్చర్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఆయనను పలువురు అభినందించారు.

News February 16, 2025

వల్లభనేని వంశీ అంటేనే అరాచకం : మంత్రి నిమ్మల

image

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీ అంటేనే అరాచకత్వం అవినీతికి మారుపేరని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. వంశీని సమర్థిస్తున్న జగన్ కూడా ఒక అరాచక శక్తి అని మండిపడ్డారు. ‘దేశంలో ఎక్కడా ఏ పార్టీ ఆఫీస్‌లపై దాడి జరగలేదు. కానీ టీడీపీ ఆఫీస్‌పై వంశీ దాడి చేశాడు. దీనిపై ఫిర్యాదు చేసిన దళితుడిని కిడ్నాప్ చేసిన ఘనుడు. 11 సీట్లు ఇచ్చినా వైసీపీ నేతలు, జగన్‌కు ఇంకా బుద్ధి రాలేదు’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

News February 16, 2025

NLG: 19 మందిలో ఒక్కరే మహిళా అభ్యర్థి

image

వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన 19 మంది అభ్యర్థులలో కేవలం ఒక్కరే మహిళా అభ్యర్థి ఉన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన అర్వ స్వాతి బరిలో నిలిచిన అతి చిన్న వయస్కురాలిగా (34 ఏళ్లు) ఉన్నారు. 68 ఏళ్ల వయసుతో హనుమకొండ జిల్లా దామరకు చెందిన దామర బాబురావు పెద్ద వయస్కుడిగా బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 27 తేదీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.

error: Content is protected !!