News November 19, 2025
జాతీయ జల అవార్డు అందుకున్న నల్గొండ జిల్లా

జల్ సంజయ్ & జన్ భగీదరి కార్యక్రమంలో దేశంలో ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాగా నల్గొండ ద్వితీయ స్థానంలో నిలిచింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జిల్లా అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్‌డీఏ పీడీ శేఖర్ రెడ్డి 6వ జాతీయ జల అవార్డు (రూ.2 కోట్ల ప్రైజ్ మనీ, ప్రశంసా పత్రం)ను అందుకున్నారు. వారికి పలువురు అభినందనలు తెలిపారు.
Similar News
News January 24, 2026
NLG: ఎన్నికలకు యంత్రాంగం సర్వం సిద్ధం!

మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వంసిద్ధమవుతోంది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఆ దిశగా అధికారుల సమాయత్తం అవుతున్నారు. జిల్లాలోని NLG కార్పొరేషన్, MLG, HLY, నందికొండ, DVK, CDR, CTL మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి మార్గదర్శకాల పుస్తకాలను మున్సిపల్ సిబ్బంది హైదరాబాద్ నుంచి తీసుకువచ్చారు.
News January 24, 2026
ఏటేటా పడిపోతున్న కూరగాయల సాగు

జిల్లాలో కూరగాయ పంటలు, ఆకు కూరల సాగు విస్తీర్ణం ఏటేటా తగ్గిపోతుంది. NLG నగరం మూడువైపులా శరవేగంగా విస్తరిస్తుండడం, వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతుండడం, మరోవైపు ప్రభుత్వపరంగా ఉద్యాన రైతులకు సహాయ సహకారాలు కొరవడటంతో ఈ పరిస్థితి ఏర్పడుతున్నది. దశాబ్ద కాలం క్రితం జిల్లాలో వందల ఎకరాలకుపైబడి విస్తీర్ణంలో వివిధ రకాల కూరగాయ పంటలు సాగయ్యేవి. ఇప్పుడు 30 శాతం కూడా సాగు చేయడం లేదు.
News January 24, 2026
NLG: సన్న బియ్యం ధరలకు రెక్కలు

నల్గొండ జిల్లాలో సామాన్యులకు సన్నబియ్యం ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఏటేటా బియ్యం రెట్టింపు అవుతున్నా అధికారులు కట్టడి చేయడం లేదు. గడిచిన నాలుగైదేండ్లుగా ఏటా వానకాలం సీజన్‌లో మిల్లుల వద్ద క్వింటా బియ్యం రూ.3వేల నుంచి రూ.3500 వరకు దొరికేది. ఈ ఏడాది గత పరిస్థితులకు భిన్నంగా వాటి ధరలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం బీపీటీ బియ్యం క్వింటా ధర కొత్తవి రూ.5,500, పాతవి రూ.6,000 పలుకుతున్నాయి.


