News August 9, 2024
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న టీవీఎస్ మోపెడ్‌ను వేగంగా వచ్చిన ఓ పల్సర్ బైక్ ఢీకొట్టింది. పల్సర్ బైక్‌పై వెనుక కూర్చున్న యువతికి ఫ్లై ఓవర్ గోడ తగలడంతో తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండంగా మార్గమధ్యంలో హారికదేవి(20) మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. యువతి స్వగృహం గుడ్లవల్లేరు మండలం కూరాడ గ్రామంగా గుర్తించారు.
Similar News
News September 9, 2024
విజయవాడ: వరద బాధితులకు రూ.కోటి విరాళం
లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అధినేత ఎమ్.కిరణ్ కుమార్ వరద బాధితుల కోసం రూ.1 కోటి విరాళాన్ని సోమవారం అందజేశారు. సీఎం చంద్రబాబును విజయవాడ కలెక్టరేట్‌లో కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన్ను సీఎం చంద్రబాబు అభినందించి, వరద బాధితులకు సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని అన్నారు.
News September 9, 2024
విజయవాడ: వరద విపత్తు వేళ దొంగల చేతివాటం
వరద బాధిత ప్రాంతాల్లో దొంగలు తమ చేతివాటం చూపిస్తున్నారు. ఇటీవల నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మొబైల్స్ షాపు, మద్యం దుకాణంలో చోరీ జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. నీళ్లలో మునిగిన బైక్‌లలో పెట్రోల్, టైర్లు చోరీ అయినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లలో మునిగిన బైక్‌లను ఆగంతుకులు తుక్కు కింద అమ్మేస్తున్నారని ముంపు ప్రాంతాల వారు చెబుతున్నారు.
News September 8, 2024
కృష్ణా జిల్లాలో పలు రైళ్ల రద్దు
నిర్వహణ కారణాల రీత్యా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రయాణించే కింది రైళ్లను ఈ నెల 9, 10 తేదీల్లో రద్దు చేశామని విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ కార్యాలయం తెలిపింది. రాజమండ్రి- విజయవాడ (07460), విజయవాడ- మచిలీపట్నం (07895) , మచిలీపట్నం- విజయవాడ (07896), విజయవాడ- మచిలీపట్నం (07769), మచిలీపట్నం- గుడివాడ (07872), గుడివాడ- మచిలీపట్నం (07871), మచిలీపట్నం- విజయవాడ (07899).