News September 11, 2025

జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: సీపీ

image

ఈనెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం CP అంబర్ కిషోర్ ఝా సూచించారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. చిన్న కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ డబ్బు, సమయం వృథా చేసుకోవద్దని పేర్కొన్నారు. ఇరుపక్షాలు సామరస్యంగా రాజీపడి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. పోలీసులు రాజీపడదగిన కేసులను గుర్తించి, ఇరువర్గాలకు అవగాహన కల్పించాలని సూచించారు.

Similar News

News December 15, 2025

IPLలో అదుర్స్.. T20Iల్లో చెత్త ప్రదర్శన

image

భారత ప్లేయర్లు సూర్య కుమార్, గిల్ ప్రదర్శన T20Iల్లో ఆందోళన కలిగిస్తోంది. IPL-2025లో సత్తా చాటిన ఈ ప్లేయర్లు, దేశం తరఫున పేలవ ప్రదర్శన చేస్తున్నారు. IPLలో సూర్య 65.18 సగటుతో 717 రన్స్, గిల్ 50 యావరేజ్‌తో 650 పరుగులు చేశారు. అయితే ఇండియా తరఫున మాత్రం స్కై 14.20 సగటుతో 213, గిల్ 24.25 సగటుతో 291 పరుగులే చేశారు. దీంతో ఈ ప్లేయర్ల స్థానంలో ఇతర ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

News December 15, 2025

హత్యాచార దోషికి క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి

image

MHలో రెండేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి క్షమాభిక్షను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరస్కరించారు. చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన కేసులో రవి అశోక్‌కు 2019లోనే సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. అతనికి శారీరక కోరికలపై కంట్రోల్ లేదని, లైంగిక వాంఛను తీర్చుకునేందుకు అన్ని పరిమితులను ఉల్లంఘించారని తీర్పునిచ్చింది. ముర్ము బాధ్యతలు స్వీకరించాక 3 సార్లు క్షమాభిక్షను తిరస్కరించారు.

News December 15, 2025

సిద్దిపేటలో బీఆర్ఎస్ 78 సీట్లు కైవసం

image

సిద్దిపేట నియోజకవర్గంలో మొత్తం 91 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. బీఆర్ఎస్ 78 సీట్లు కైవసం చేసుకోగా అధికార కాంగ్రెస్ 5 పంచాయతీ స్థానాలు వెల్కటూర్, బూరుగుపల్లి, రాంపూర్, నాగరాజు పల్లి, బచ్చాయిపల్లిలో గెలిచింది. బీజేపీ 2 పంచాయతీ స్థానాలు చందలా పూర్, నాంచారుపల్లి గెలవగా ఇండిపెండెంట్ -6 తడకపల్లి, అల్లీపూర్, కోదండరావుపల్లి, సిద్దన్నపేట, ఖానాపూర్, రాజ్ గోపాల్ పేట్ గెలుపొందారు.