News August 13, 2025
జాతీయ సమైక్యతకు ప్రతి ఒక్కరూ జండా ఎగరవేయాలి: కలెక్టర్

జిల్లాలో 15 లక్షల మంది జనాభా ఉన్నారని జాతి సమైక్యతకు చిహ్నంగా ప్రతి ఒక్కరు ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. ఈనెల 15వ తేదీన జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరుకానున్నారని చెప్పారు. ఈనెల15వ తేదీన పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే 79వ స్వాతంత్ర్య దినోత్సవానికి ప్రజలందరూ హాజరు కావాలని కోరారు.
Similar News
News March 16, 2026
HYD: ఆదివారం.. నెత్తురోడిన నగరం

నగరంలో వీకెండ్ రక్తపాతం జరిగింది. వరుస ప్రమాదాలు, దారుణ ఘటనలు కలకలం రేపాయి. మేడిపల్లిలో కారు ఢీకొనడంతో దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఒక్కగానొక్క కొడుకు అనాథయ్యాడు. ఉప్పల్‌లో కానిస్టేబుల్ సుధీర్‌ను దారుణంగా కత్తులతో హత్య చేశారు. శంషాబాద్‌లో వాహనం ఢీకొని విజయ్ (32) మృతి చెందాడు. గచ్చిబౌలిలో కర్ణాటక RTC బస్సు ఢీకొనడంతో బాలమ్మ (68) ప్రాణాలు కోల్పోయింది. ఒకే రోజు ఇన్ని దారుణాలు జరిగాయి.
News March 16, 2026
కడప: పదో తరగతి ఎగ్జాం రూములోకి పాము

కడప జిల్లా బి.కోడూరులో పదో తరగతి పరీక్షలు సోమవారం మొదలయ్యాయి. స్థానికంగా ఉన్న ఓ పరీక్షా కేంద్రంలోని రూములోకి పాము వచ్చింది. విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. స్కూల్ సిబ్బంది పామును చంపి బయట వేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులు వెళ్లారు.
News March 16, 2026
నేటి పరీక్షకు 96% హాజరు నమోదు

హనుమకొండ జిల్లాలో నేడు నిర్వహించిన ఇంటర్ ఒకేషనల్ పరీక్షకు 96% హాజరు నమోదయింది. జిల్లా వ్యాప్తంగా 750 మంది విద్యార్థులకు గాను 724 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 26 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు.


