News August 22, 2025
జానపదమా జనంలో ఉండిపో..!

జానపద కళలకు తెలుగు భూమి పండిన పంట పొలం వంటిది. బాపట్ల జిల్లాలోని జానపదులు జి.వెంకటశివయ్య బుర్రకథ దళం, యల్లమంద జంగం కథకుడు, తమ్మారపు వెంకట స్వామి వీధి నాటకాలు ఆడేవారు. దొడ్డారపు వెంకట స్వామి ఆ రోజుల్లో గొప్ప జంగం కథా గాయకుడిగా వెలుగొందారు. వీరు అనేక కళారూపాలను చేపట్టి ప్రజలను ఐక్యం చేశారు. నెమలి నృత్యం, తోలుబొమ్మలు, కోలాటం వంటివి జిల్లాలో ప్రత్యేకత సంతరించుకున్నాయి. నేడు ప్రపంచ జానపద దినోత్సవం.
Similar News
News January 17, 2026
వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టిన మరాఠా

అధికారం కోసం చేసే రాజకీయ విన్యాసాలను ప్రజలు తిరస్కరిస్తారనేందుకు MH మున్సిపల్ ఎన్నికలే తార్కాణం. 2023లో NCP చీలి బాబాయ్, అబ్బాయి శరద్, అజిత్ పవార్లు విడిపోయారు. తాజా ఎన్నికల్లో చేతులు కలిపారు. అటు అన్నదమ్ములు ఉద్ధవ్(శివసేన), రాజ్ ఠాక్రే(MNS)లు కూడా విభేదాలు పక్కనపెట్టి MNP ఎన్నికల్లో కలిసిపోయారు. కానీ వీరికి ఆశించిన ఫలితాలు రాలేదు. కుటుంబ వారసత్వాన్ని కొనసాగిద్దామనుకున్న వీరిని ప్రజలు ఆదరించలేదు.
News January 17, 2026
NZB: మేయర్, మున్సిపల్ ఛైర్మన్ రిజర్వేషన్లు ఇవే

త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు భీంగల్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల మేయర్, ఛైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. NZbమేయర్ పదవిని జనరల్ (మహిళ)కు, బోధన్ మున్సిపల్ ఛైర్మన్ అన్ రిజర్డ్వ్డ్‌కు రిజర్వ్ చేయగా ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ ఛైర్మన్ పదవులను జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు.
News January 17, 2026
కడప టు ఢిల్లీ

ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు కడప కూచిపూడి కళాకారిణి మూలి పల్లవి ఎంపికయ్యారు. లలిత కళలకు నిలయమైన కడపకు అరుదైన గౌరవాన్ని మూలి పల్లవి తీసుకొచ్చారు. భారత సాంస్కృతిక శాఖ నుంచి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లి భారత అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, సంగీత నాటక అకాడమీ కేంద్రాలలో ప్రత్యేక రిహార్సల్ పొందుతున్నారు. ఏపీ నుంచి కూచిపూడి నృత్యానికి సంబంధించి 30 మందిని ఎంపికచేసింది.


