News March 8, 2025

జియమ్మవలస: కష్టపడి చదవితే..ఉత్తమ ఫలితాలు

image

విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యాం ప్రసాద్ అన్నారు. మండలంలోని రావాడ రామభద్రపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశలో పదో తరగతి కీలక మలుపుతిప్పుందన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలన్న తపనతో పాఠ్యాంశాలను అవలోకనం చేసుకోవాలని వారికి సూచించారు.

Similar News

News December 14, 2025

వనపర్తి జిల్లాలో తొలి సర్పంచ్ గెలుపు ఇక్కడే!

image

అమరచింత మండల పరిధిలోని అమరచింత ఆర్ఆర్ సెంటర్ సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుదారురాలు విజయభారతి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి చిన్న మునిప్పపై ఆమె 90 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు గాను, 2 ఏకగ్రీవం కాగా, మిగిలిన 12 పంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

News December 14, 2025

రాజనగర్ సర్పంచ్‌గా బీఆర్ఎస్ మద్దతుదారు గెలుపు

image

రాయికల్ మండలం రాజనగర్ గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారు భారతపు రాజేష్ ఘన విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థి సిరిపురపు రాములుపై 380 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అదే గ్రామంలో 8 వార్డ్‌ల సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషంగా నిలిచింది. ప్రజల విశ్వాసంతో గ్రామాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని సర్పంచ్ భారతపు రాజేష్ ఈ సందర్భంగా తెలిపారు.

News December 14, 2025

లేటెస్ట్ మూవీ అప్‌డేట్స్

image

✦ 2026, జనవరి 1న వెంకటేశ్ హీరోగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా థియేటర్లలో రీరిలీజ్
✦ ఈరోజు సా.6.30 గంటలకు ‘రాజాసాబ్’ నుంచి ‘సహానా సహానా’ పాట ప్రోమో విడుదల.. పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ టీమ్
✦ ‘మోగ్లీ’ సినిమాకు తొలి రోజు రూ.1.22 కోట్ల కలెక్షన్స్
✦ డిసెంబర్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం?