News April 24, 2025

జియమ్మవలస : బాలిక కిడ్నాప్ .. పదేళ్ల జైలు

image

జియమ్మవలసలో బాలిక కిడ్నాప్ కేసులో కన్నపుదొరవలసకు చెందిన ఓ వ్యక్తికి విజయనగరం స్పెషల్ పోక్సో కోర్టు జడ్జి పదేళ్లు జైలు శిక్ష, రూ. 2000 జరిమానా విధించింది. ఈమేరకు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి బుధవారం తెలిపారు. 2021 మార్చిలో చినమేరంగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందన్నారు. సీఐ దర్యాప్తు చేపట్టి ముద్దాయికి శిక్ష పడేలా చేశారన్నారు.

Similar News

News March 6, 2026

HNK: ఇంటర్ పరీక్షల్లో 98 శాతం హాజరు నమోదు

image

హనుమకొండ జిల్లాలో నేడు నిర్వహించిన ఇంటర్ పరీక్షల్లో 98% హాజరు నమోదయింది. 17,163 మంది విద్యార్థులకు గాను 16,856 మంది విద్యార్థులు నేడు పరీక్షకు హాజరయ్యారు. 284 మంది జనరల్ విద్యార్థులు, 23 మంది ఒకేషనల్ విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

News March 6, 2026

గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం!

image

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల నడుమ LPG విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్లను ప్రధానంగా గృహ వినియోగదారులకే సరఫరా చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు స్పష్టం చేసింది. IOCL, BPCL, HPCLకు ఆదేశాలు జారీ చేసింది. కమర్షియల్, ఇండస్ట్రియల్, పెట్రో కెమికల్ రంగాలకు గ్యాస్ సప్లైపై తాత్కాలిక పరిమితులు విధించింది. సాధారణ ప్రజలకు LPG సరఫరాలో అంతరాయం ఉండొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

News March 6, 2026

చిత్తూరు SE కీలక ఆదేశాలు

image

వేసవి నేపథ్యంలో అవసరాల మేరకు ట్రాన్స్‌ఫార్మర్లను నిల్వ చేసుకోవాలని చిత్తూరు ట్రాన్స్‌కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ ఆదేశించారు. ప్రస్తుతం నెలకు 400 పైగా ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతుకు గురవుతున్నాయన్నారు. ఏప్రిల్‌లో ఈ సంఖ్య రెండింతలు వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. అప్పుడు ఇబ్బంది పడకుండా కనీసం 1,800 ట్రాన్స్‌ఫార్మర్లను నిల్వ చేసుకోవాలని సూచించారు.