News November 6, 2025

జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి: డీఎంహెచ్‌వో

image

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో మహబూబాబాద్ జిల్లాను అగ్రభాగాన నిలపాలని డీఎంహెచ్‌వో డాక్టర్ బి. రవి రాథోడ్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌ ప్రధాన సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. మాతా శిశు సంరక్షణ, క్షయ వ్యాధి నియంత్రణ వంటి కీలక అంశాలపై వైద్యాధికారులు, నర్సింగ్‌ ఆఫీసర్లు, సూపర్‌వైజర్ సిబ్బందితో డీఎంహెచ్‌వో సమీక్షించారు.

Similar News

News January 23, 2026

గన్నవరంలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం

image

దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సును విజయవంతంగా ముగించుకుని వచ్చిన CM చంద్రబాబుకు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు పలువురు నేతలు ఆయనకు పూలమాలలతో స్వాగతం పలికారు. ఈ పర్యటనలో దాదాపు రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా రాష్ట్ర యువతకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రులు హర్షం వ్యక్తం చేశారు.

News January 23, 2026

పారదర్శకమైన ఓటర్ల జాబితానే లక్ష్యం: DRO

image

చిత్తూరు కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో DRO మోహన్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. ఇప్పటి వరకు జిల్లాలో 15,76,984 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహిస్తామన్నారు. ఈ ప్రక్రియ ద్వారా బోగస్, మరణించిన వారిని జాబితా నుంచి తొలగించి పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించ వచ్చని ఆయన పేర్కొన్నారు.

News January 23, 2026

కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు: బండి సంజయ్

image

TG: కేసీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్‌తో పాటు ఎన్నో అక్రమాలకు పాల్పడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అయినా ఆ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు. ఢిల్లీకి ముడుపుల కోసమే ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో సాగదీస్తున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి అన్ని ఆధారాలున్నా KCR కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.