News October 7, 2025

జిల్లాలోనే అధిక పరిపాలనా విభాగాలు పర్చూరులోనే..!

image

పర్చూరు నియోజకవర్గం బాపట్ల జిల్లాలో ప్రత్యేకస్థానం సంపాదించింది. సాధారణంగా నియోజకవర్గానికి ఒక్కో ఉన్నతాధికారి ఉండడం సాధారణం. కానీ పర్చూరులో ఈ పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ నియోజకవర్గంలో 6 మండలాలు ఉండగా, వీటి పరిపాలనకు ఇద్దరు DSPలు, ముగ్గురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు RDOలు ప్రజలకు సేవలు అందిస్తున్నారు. దీంతో పర్చూరు నియోజకవర్గం బాపట్ల జిల్లాలోనే అత్యధిక పరిపాలన వ్యవస్థగా ఉందని ప్రజలు అంటున్నారు.

Similar News

News January 19, 2026

డిసెంబర్ నాటికి సమస్యలు ఉండ కూడదు: కలెక్టర్

image

వన్ విలేజ్ 4 విజిట్ కార్యక్రమంలో ప్రజలు తెలిపిన సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వన్ విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమంలో ప్రజలు, రైతులు తెలియజేసిన రెవెన్యూ సంబంధిత సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలన్నారు. జిల్లావ్యాప్తంగా డిసెంబర్ నాటికి సమస్యలు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు.

News January 19, 2026

ఘనంగా గణతంత్ర వేడుకలు: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేడుకల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

News January 19, 2026

పంచాయతీలకు 8 ఈ-ఆటోల పంపిణీ

image

పుట్టపర్తిలోని జిల్లా పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం డీపీఓ సమత 8 ఈ-ఆటోలకు పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలోని గ్రామాల్లో పరిశుభ్రతను పెంచేందుకు వీటిని పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనకల్లు, రోళ్ళ, ఎన్‌పీ కుంట, మడకశిర, తలుపుల, గాండ్లపెంట, పరిగి, నల్లచెరువు మండలాల పంచాయతీలకు వీటిని కేటాయించారు. చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు.