News September 10, 2025
జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష

జిల్లాలో నిర్మాణం పూర్తి అయిన మల్టీపర్పస్ గోడౌన్లను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాకు నాబార్డ్ మంజూరు చేసిన 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 24 మల్టీ పర్పస్ గోడౌన్స్‌లో 14 పూర్తి చేశామన్నారు. ఇంకా 10 గోడౌన్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు.
Similar News
News December 11, 2025
భీమవరం: ‘స్పేస్ టెక్నాలజీలో ఏపీ నెంబర్ వన్ కావాలి’

స్పేస్ టెక్నాలజీలో ఏపీ నెంబర్ వన్ కావాలనే ఉద్దేశంతోనే ఏపీ స్పేస్ టెక్నాలజీ అకాడమీ అమరావతి ఏర్పాటైందని
ఇస్రో మాజీ శాస్త్రవేత్త డా శేషగిరిరావు అన్నారు. గురువారం భీమవరంలో అడ్వాన్సింగ్ స్పేస్ సైన్స్ అండ్ సొసైటీ అనే అంశంపై జరిగిన సదస్సులో మాట్లాడారు. ప్రస్తుతం స్పేస్ ఎకానమీలో మన వాటా 2 శాతం మాత్రమే ఉందని, రానున్న కాలంలో 10 శాతానికి పెంచాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
News December 11, 2025
యూత్ హాస్టల్స్ కోరల్ జూబిలీ సావనీర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోరల్ జూబిలీ సావనీర్‌ను కలక్టరేట్‌లో గురువారం కలెక్టర్ నాగరాణి ఆవిష్కరించారు. భీమవరం యూనిట్ దక్షిణ భారత దేశంలో 2వ అతిపెద్ద యూనిట్‌గా అభివృద్ధి చేసినందుకు కార్యవర్గాన్ని అభినందించారు. ట్రెక్కింగ్, రాప్టింగ్, హైకింగ్, పారా గ్రైండింగ్, రాఖ్ క్లైమ్బింగ్ వంటి అడ్వెంచర్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామని యూనిట్ ఛైర్మన్ మట్లపూడి సత్యనారాయణ కలెక్టర్‌కు వివరించారు.
News December 11, 2025
ఆకివీడు: రూ.5 వేలకే గ్రాము బంగారం అంటూ మోసం..!

ఆకివీడులో ఓ ముఠా గ్రాము బంగారం రూ.5 వేలకే ఇస్తామని నమ్మించి మోసానికి తెరలేపింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. తక్కువ ధరకే బంగారం వస్తుందని ఆశపడిన భీమవరం, హైదరాబాద్ యువకులు ఆకివీడు వచ్చి రూ.2.50 లక్షలు చెల్లించారు. తీరా చూసుకుంటే అది నకిలీ బంగారమని తేలింది. బాధితులు తిరిగి వెళ్లి నిలదీయగా, రూ.1.20 లక్షలు వెనక్కి ఇచ్చి రాజీ కుదుర్చుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.


