News August 23, 2025
జిల్లాలో ఎరువులకు కొరత లేదు: కలెక్టర్

జిల్లాలో ఎరువులకు కొరత లేదని, సరిపడినంత స్టాకు సిద్దంగా ఉందని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖామంత్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు వివిధ జిల్లాల కలెక్టర్లు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని ఎరువుల పరిస్థితి, పంటల స్థితిగతులను వారికి కలెక్టర్ వివరించారు.
Similar News
News January 21, 2026
బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత: జడ్జి సుధారాణి

బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని భీమవరం సివిల్ జడ్జి సుధారాణి అన్నారు. బుధవారం ఉండి ఎంపీడీఓ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వివరిస్తూ, ఎక్కడైనా ఇలాంటివి జరిగితే తక్షణమే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం ఈ సామాజిక రుగ్మత నిర్మూలనకు అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎన్.సుధీర్ పాల్గొన్నారు.
News January 21, 2026
భీమవరం: మావుళ్లమ్మ తల్లి స్వర్ణ వస్త్ర నిధికి బంగారం అందజేత

భీమవరంలో కొలువైన శ్రీమావుళ్లమ్మ అమ్మవారికి పట్టణానికి చెందిన భరత్ కుమార్, వరలక్ష్మీ నాగప్రసన్న 8 గ్రాముల అమ్మవారి స్వర్ణ వస్త్ర నిధికి విరాళంగా అందజేశారు. ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ నాగభూషణం, ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగర్ పాల్గొన్నారు.
News January 21, 2026
నరసాపురం స్కూల్‌కు జాతీయ స్థాయి గుర్తింపు

నరసాపురం స్టీమర్ రోడ్డులోని మున్సిపల్ మోడల్ ప్రాథమిక పాఠశాల అరుదైన మైలురాయిని అందుకుంది. స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ (SHVRM) మూల్యాంకనంలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, జాతీయ పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా హెచ్ఎం సుధీర్ బాబు, ఉపాధ్యాయులను ఎంఈవోలు పుష్పరాజ్యం, జాన్ ప్రభాకర్ అభినందించారు. పాఠశాల పారిశుద్ధ్యం, హరిత వనరుల నిర్వహణపై అధికారులు ప్రశంసలు కురిపించారు.


