News August 11, 2025
జిల్లాలో కళకళలాడుతున్న జలాశయాలు

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని జలాశయాలు నీటినిల్వతో కళకళ లాడుతున్నాయి. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను కడప జిల్లాకు వదులుతున్నారు. దీంతో ప్రస్తుతం గండికోటలో 18.57 TMCలు, మైలవరంలో 5.48, బ్రహ్మసాగర్‌లో 6.32, బద్వేల్ ట్యాంక్‌లో 0.01, CBCలో 4.41, పైడిపాలెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 4.46, సర్వరాజ సాగర్లో 1, వామికొండ సాగర్లో 0.79, బుగ్గవంకలో 0.04 TMCల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Similar News
News March 12, 2026
కడపలో రైతులకు రైతులే మార్గదర్శకులు: కలెక్టర్

జిల్లాలో వ్యవసాయ రంగంలో వినూత్నంగా అమలు చేస్తున్న “ఛాంపియన్ రైతుల ఎంపిక విధానం” గురించి కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సీఎంకి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 361 రైతు సేవా కేంద్రాల పరిధిలో ప్రతి గ్రామంలో ఎక్కువగా పండించే పంటలో నైపుణ్యం కలిగిన 361 మంది రైతులను ఆదర్శ రైతులుగా (ఛాంపియన్లు) గుర్తించినట్లు తెలిపారు. రైతులకు పంటల సాగు విధానలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.
News March 12, 2026
కడప: ‘సీఐ అశోక్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు’

కడప జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో పనిచేసిన సీఐ అశోక్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భూమి సెటిల్‌మెంట్లు, ఇతర అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఆయనపై ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై ఆధారాలు లభ్యమవ్వడంతో సీఐ అశోక్‌రెడ్డిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. కాగా ఆయన గత రెండేళ్లుగా వీఆర్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
News March 12, 2026
నెల రోజుల్లోగా స్మార్ట్ కిచెన్ పనులు పూర్తి చేస్తాం: కడప కలెక్టర్

కడప జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 33 స్మార్ట్ కిచెన్ల నిర్మాణాన్ని నెల రోజుల్లో పూర్తి చేస్తామని కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సీఎం చంద్రబాబుకు వివరించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించడమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని జిల్లాలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.


