News November 19, 2025

జిల్లాలో చిన్న నీటి వనరుల గణన పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చిన్న నీటి వనరుల లెక్కలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో 7వ మైనర్ ఇరిగేషన్ – 2వ వాటర్ బాడీస్ సెన్సస్ కార్యక్రమాన్ని జిల్లాలో ఎలా అమలు చేయాలన్న అంశంపై జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఐదేళ్లకొకసారి నిర్వహిస్తారని తెలిపారు.

Similar News

News January 23, 2026

ఏలూరులో గోదావరి పుష్కరాలపై కలెక్టర్ కీలక సమీక్ష

image

రామన్న గోదావరి పుష్కరాల్లో ఏలూరు జిల్లాలో సుమారు 50 లక్షల మందికి పైగా పుణ్య స్నానాలు ఆచరించే అవకాశం ఉన్నందున అందుకు తగిన విధంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులు ఆదేశించారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, సంబంధిత అధికారులతో శుక్రవారం కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు జరుగుతాయన్నారు.

News January 23, 2026

NRPT: ‘ఎన్నికల నిర్వహణలో ఆర్వోల పాత్ర కీలకం’

image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఆర్వోల పాత్ర కీలకం అని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్‌లో నారాయణపేట, మద్దూరు మున్సిపాలిటీలకు సంబంధించిన ఆర్వో, ఏఆర్వోలకు మాస్టర్ ట్రైనర్లతో ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నామినేషన్ ప్రక్రియతో మొదలుకొని పోలింగ్, ఓట్ల లెక్కింపు అన్ని నిబంధనల మేరకు నిర్వహించాలని అన్నారు.

News January 23, 2026

సంగారెడ్డి: అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు: కలెక్టర్

image

మహిళలు విద్య, ఉద్యోగం, క్రీడలు, వ్యాపారం అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తున్నారని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. స్వధార్ హోమ్, శక్తి సదన్‌లో ఆశ్రయం పొందుతున్న మహిళలు, యువతులకు 20 వస్తువులతో కూడిన ఎంపవర్మెంట్ కిట్లను జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పంపిణీ చేశారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ తమ హక్కులను తెలుసుకొని స్వావలంబన సాధించాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి పాల్గొన్నారు.