News August 21, 2025
జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు: కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. బుధవారం ఆమె సిర్గాపూర్‌లో ఫర్టిలైజర్ దుకాణంలో ఎరువుల విక్రయాలను పరిశీలించారు. జిల్లాలో వ్యవసాయ సాగుకు అవసరమైన యూరియా సమృద్ధిగా ఉందని తెలిపారు. యూరియాను పంట సాగుకు మాత్రమే వినియోగించాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల సమన్వయంతో టాస్క్ ఫోర్స్ టీం అక్రమ రవాణా జరగకుండా చూస్తుందన్నారు.
Similar News
News January 22, 2026
మార్కెట్ విలువ పెంపు.. రియల్ బూమ్, ఆదాయమే టార్గెట్!

AP: రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడం, ఆదాయం పెంచుకోవడమే టార్గెట్‌గా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భూముల <<18911969>>మార్కెట్ విలువ<<>> పెంచాలని నిర్ణయించింది. గతేడాది ఫిబ్రవరి 1వ తేదీన పెంచిన విలువతో దాదాపు 9 నెలల్లోనే రూ.7వేల కోట్లు ఆర్జించింది. ఈసారి కూడా అదే స్ట్రాటజీతో ముందుకు సాగుతోంది. 7-8 శాతం వరకు పెంపు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రతి సంవత్సరం మార్కెట్ విలువ పెంచే అవకాశం ఉంది.
News January 22, 2026
అరసవెల్లి: రథసప్తమికి దర్శన టోకెన్ల ధరలు ఇలా..!

అరసవెల్లి దేవస్థానంలో ఈ నెల 24న జరగనున్న రథసప్తమి ఉత్సవాలలో భక్తులు దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లు వివరాలు ఇలా ఉన్నాయి. ఉచిత దర్శనం, రూ.100 దర్శనం, రూ.300, వీఐపీ దర్శనాలు కోసం ఒక్కోదానికి రెండు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. వీవీఐపీ దర్శనాలను ఉత్తర ద్వారం ద్వారా పంపించి ఫుట్ ఓవర్ బ్రిడ్జి నుంచి మీడియా పాయింట్ వద్దకు చేరుకునేలా ఏర్పాటు చేశారు.
News January 22, 2026
ఖమ్మం: మున్సిపల్ పోరు.. సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..!

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి పెరిగింది. పార్టీలన్నీ గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. ఆశావహులు భారీగా ఉండటంతో అభ్యర్థుల ఎంపిక పార్టీలకు సవాలుగా మారింది. కాంగ్రెస్‌లో పోటీ తీవ్రంగా ఉండటంతో సర్వేల ఆధారంగా ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. అటు బీఆర్ఎస్ సైతం సర్వేలతో పాటు వార్డుల్లో పట్టున్న నేతల కోసం కసరత్తు చేస్తున్నాయి. అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేస్తూ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి.


